ETV Bharat / crime

Fake Police: తప్పించుకు తిరుగుతున్న నకిలీ పోలీస్​​... చివరికి చిక్కాడు.!

author img

By

Published : Jun 11, 2021, 6:28 PM IST

Fake police officer  arrested
నకిలీ పోలీసు అధికారి అరెస్ట్

పోలీస్ అధికారినంటూ హల్ చల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల వైపు నుంచి పోలీస్​ సైరన్​తో కారులో వస్తుండగా అతన్ని ప్రశ్నించారు. ముంబయి ఇంటలిజెన్స్​ ఎస్పీనని చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా.. నకిలీ అధికారిగా గుర్తించారు.

నకిలీ పోలీస్ అధికారిగా చెలామణి అవుతూ పోలీస్ సైరన్ కారుతో హల్ చల్ చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి ఖానాపూర్ నుంచి మంచిర్యాల వైపు పోలీస్​ సైరన్​తో వస్తున్న కారును ఆపి అతన్ని ప్రశ్నించారు. తాను ముంబయి ఇంటలిజెన్స్​ ఎస్పీనని చెప్పగా.. ఐడీకార్డు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రదీప్ లాక్​ డౌన్​ సమయంలో ముంబయి ఇంటలిజెన్స్ ఎస్పీనని చెబుతూ రహదారిపై తన వాహనంతో సైరన్​ మోగిస్తూ తిరుగుతున్నారు. పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకుంటున్న ప్రదీప్​ చివరికి హాజీపూర్ పోలీసులకు చిక్కారు. అతను పోలీసు చెక్​పోస్టుల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసినట్లు మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

ఇదీ చూడండి: సీజేఐగా తొలిసారి హైదరాబాద్​కు జస్టిస్​ ఎన్​వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.