ETV Bharat / crime

ఎంబీబీఎస్ అభ్యర్థులకు.. ఎయిమ్స్ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్స్

author img

By

Published : Dec 5, 2022, 8:12 PM IST

Fake Mails in The Name of AIIMS Director
Fake Mails in The Name of AIIMS Director

Fake Mails in The Name of AIIMS Director: మంగళగిరి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ పేరుతో సైబర్‌ నేరస్థులు నకిలీ మెయిల్‌ సృష్టించారని అధికారులు తెలిపారు. ఎం​బీబీఎస్​ సీట్లు ఇస్తామంటూ కొందరు అభ్యర్ధులకు ఫోన్‌ కాల్స్‌, మెయిల్స్‌ పంపారని వెల్లడించారు. అనుమానం వచ్చిన కొందరు విద్యార్థులు అధికారులను సంప్రదించడంతో, అసలు అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ మెయిల్స్​కు స్పందించకూడదంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Fake mails in the name of AIIMS Director: వారంతా ఎం​బీబీఎస్‌ సీట్ల కోసం ఎదురుచుస్తున్న విద్యార్థులు. వారిలో కొంతమంది తమకు సీటు రానివారు సైతం ఉన్నారు. అలాంటి వారికి ఎరవేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు సైబర్‌ నేరగాళ్లు. అనుకున్నదే తడువుగా మంగళగిరి ఎయిమ్స్ పేరుతో నకలీ మెయిల్ సృష్టించారు. ఎం​బీబీఎస్‌ సీట్లు ఇస్తామంటూ కొందరు అభ్యర్ధులకు ఫోన్‌ కాల్స్‌, మెయిల్స్‌ పంపారని తెలపడంతో అధికారులు స్పందించారు.

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న ఎయిమ్స్‌ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ పేరుతో నకిలీ మెయిల్‌ క్రియేట్‌ చేశారని గుర్తించామన్నారు. డైరెక్టర్‌ పేరుతో ఫోన్‌ కాల్స్‌ గానీ, మెయిల్స్‌ గానీ వస్తే ప్రజలు నమ్మొద్దని ప్రకటనలో తెలిపారు. ఎం​బీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ కేవలం ప్రభుత్వం నిర్దేశించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారానే జరుగుతుందని ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత అధికార వెబ్‌ సైట్​లోనే చూడాలని కోరారు.

ఎంబీబీఎస్ అభ్యర్థులకు.. ఎయిమ్స్ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్స్
ఎంబీబీఎస్ అభ్యర్థులకు.. ఎయిమ్స్ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్స్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.