ETV Bharat / crime

FAKE CERTIFICATES: ఇంద్రకీలాద్రిలో ఆగని 'నకిలీ'లలు.. ఉద్యోగుల సస్పెన్షన్​

author img

By

Published : Jun 29, 2021, 8:15 AM IST

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై నకిలీ(FAKE CERTIFICATES) ధ్రువపత్రాల బాగోతం మరోసారి చర్చనీయాంశమైంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందిన ఇద్దరిపై దుర్గగుడి ఈవో భ్రమరాంబ వేటు వేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు చేపట్టకపోవడంతో ఏళ్ల తరబడి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇద్దరిని సస్పెండ్‌ చేయడంతోపాటు పోలీసు కేసు నమోదు చేయడంతో అక్రమార్కుల్లో గుబులుమొదలైంది.

indrakeeladri temple
ఇంద్రకీలాద్రిలో ఉద్యోగుల సస్పెన్షన్​

ఇంద్రకీలాద్రిలో ఉద్యోగుల సస్పెన్షన్​

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ దుర్గగుడి(Vijayawada Durga Gudi)లో నకిలీ ధ్రువీకరణ పత్రాల దందా(FAKE CERTIFICATES) మరోసారి తెరపైకి వచ్చింది. చాలా ఏళ్లుగా అనేక విమర్శలు వస్తున్నా.. గతంలోని అధికారులెవరూ పట్టించుకోలేదు. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలు నకిలీవని గుర్తించిన ఈవో భ్రమరాంబ విచారణ చేయగా.. వారు కూడా అంగీకరించారు. వారిద్దరినీ సస్పెండ్‌ చేశారు. దేవస్థానాన్ని మోసం చేయడం, అక్రమ పద్ధతుల్లో పదోన్నతి పొంది జీతభత్యాలు తీసుకున్నందుకు విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2019లోనే వెలుగులోకి..

ఇంద్రకీలాద్రి( Indrakeeladri )పై నకిలీ ధ్రువపత్రాల( Fake Certificates )తో ఉద్యోగాలు పొందిన విషయంపై 2019 లోనే విజిలెన్స్‌ అధికారులు దృష్టిపెట్టారు. పక్కాగా ఆధారాలు దొరికిన ఒకరిద్దరు సిబ్బందిని విచారించగా.. వాళ్లు తప్పించుకునేందుకు మరికొందరి పేర్లు చెప్పినట్టు తెలిసింది. సమగ్ర విచారణ కోసం మరికొందరి వివరాలు కావాలని విజిలెన్స్‌ అధికారులు దేవస్థానాన్ని కోరారు. విచారణ సుదీర్ఘంగా మారి.. పక్కదారి పట్టింది. తాజాగా మరోసారి విజిలెన్స్‌ అధికారులు దృష్టిపెట్టడడంతో నకిలీల డొంక కదిలింది. ప్రస్తుతం ఉన్న ఈవో భ్రమరాంబ దీనిపై అంతర్గత విచారణ చేపట్టడంతో ఇద్దరు ఉద్యోగులు దొరికారు.

ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి..

ఆలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.లక్ష్మణ్‌... పది, ఇంటర్‌ ధ్రువపత్రాలను రాజస్థాన్‌కు చెందిన విద్యాసంస్థ నుంచి పొందినట్టుగా నకిలీవి పెట్టారు. జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.వి.ఎన్‌.రాజు బిహార్‌కు చెందిన మగధ యూనివర్శిటీ నుంచి అరబిక్‌ హిస్టరీలో డిగ్రీని చేసినట్టుగా దొంగ పత్రాలు పెట్టారు. వీరిద్దరినీ ప్రశ్నిస్తే.. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పెట్టినట్టుగా లిఖిత పూర్వకంగా అంగీకరించినట్టు తెలిసింది. వెంటనే స్పందించిన ఈవో ఇద్దరినీ సస్పెండ్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం డి.వి.ఎన్‌.రాజును అరెస్ట్‌ చేశారు. కె.లక్ష్మణ్‌ పరారీలో ఉన్నట్టు తెలిసింది.

మరికొందరు ఉద్యోగులు కూడా దొంగ పత్రాలతో విధుల్లో కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం బయట ఆలయాల్లో ఉన్న కొందరు ఉద్యోగుల పేర్లు కూడా జాబితాలో వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: MP KOMATI REDDY: 'రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.