హైదరాబాద్​లో మరో కంపెనీ ఘరానా మోసం.. విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు..!

author img

By

Published : Nov 19, 2022, 12:11 PM IST

Diginal India Private Limited

Diginal India Private Office Scams: కేవలం పేపర్లు స్కాన్‌చేస్తే చాలు లక్షల్లో ఆదాయం.. కట్టిన సెక్యూరిటీ డిపాజిట్‌ని 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాం. హైదరాబాద్‌లోని డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు

Diginal India Private Office Scams: ఇంటి వద్దనుంచి పనిచేసి లక్షల్లో ఆర్జించండి.. అంటూ పలు దిన పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసి పలువురు ఆ సంస్థను ఆశ్రయించారు. దిల్లీకి చెందిన దీపక్‌శర్మ, వరుసకు సోదరుడైన అమిత్‌శర్మ గుర్తింపు కార్డులపై ఫోటోను మార్చి.. రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుచేశాడు. బంజారాహిల్స్‌లో కార్యాలయం తెరచి పేపర్లలో ప్రకటనలిచ్చాడు. అమెరికా, యూకేకు చెందిన నవలలు, పలు పుస్తకాలు, దస్త్రాలు, డిజిటలైజేషన్‌ చేయాలని.. ఒక్కోదాన్ని పీడీఎఫ్​గా మార్చి పెన్‌డ్రైవ్‌లో కాపీచేస్తే చాలని నమ్మించాడు.

ఇందుకు ముందుగా అభ్యర్ధులే సెక్యురిటీ డిపాజిట్‌ చెల్లించాలని సూచించాడు. పలుస్లాబులు ఏర్పాటు చేసి ఒక్కో స్లాబ్‌కు ఒక్కో రేటు చొప్పున ఒప్పందం చేసుకుంటున్నారు. 10 వేల పేజీలస్లాబ్‌లో ఒప్పందం చేసుకుంటే 25 రోజుల్లో ఆ పని పూర్తిచేయాలి. ఆ స్లాబ్‌లో 96వేల500 అభ్యర్ధి నుంచి సెక్యురిటీ డిపాజిట్‌ తీసుకుంటున్నారు. 11 నెలల ఒప్పందంలో అభ్యర్ధికి ప్రతి నెల ఆ స్లాబ్‌ కింద 50 వేలు చెల్లిస్తామని.. తొలుత చెల్లించిన డిపాజిట్‌ను ఆరు నెలల్లో తిరిగి ఇస్తామని ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు.

ఇలా 20వేల పేజీల స్లాబ్‌లో లక్షా 93 లక్షలు కడితే నెలకు లక్ష చెల్లిస్తామని, రెండు లక్షల పేజీల వరకు స్లాబులు ఏర్పాటుచేశారని పోలీసులు తెలిపారు. తొలి 3 నెలలుపాటు ప్రకటించినట్లుగా నిర్వాహకులు డబ్బుచెల్లించారు. అనంతరం రావాల్సిన డబ్బు ఇవ్వకుండా జాప్యం చేయడంతో.. పలువురు నిర్వాహకుల వద్దకు వెళ్లారు. డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ సంస్థలో పనిచేస్తున్న వారిని నిలదీశారు. కంపెనీ యజమాని అమిత్‌ శర్మ ఫోన్‌ స్విచాఫ్‌ చేశారని తెలసి మోసపోయినట్లు గ్రహించి బాధితులు.. హైదరాబాద్ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొదట అనుమానించినా 3నెలల పాటు సక్రమంగానే డబ్బు చెల్లించడంతో తమతో పాటు మరికొందరిని సంస్థలో చేర్పించామని వాపోతున్నారు. కేసులో ఇప్పటికే డైరెక్టర్లు సమీరుద్దీన్, అశిష్‌కుమార్‌లతో పాటు దిల్లీలోని ఫ్రంట్ ఆఫీస్ ఇంచార్జ్ దీపక్‌ అరెస్ట్‌చేయగా.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దీపక్ శర్మను డిల్లీలో చిక్కినట్లు పోలీసులు వెల్లడించారు. సులభంగా అధికమొత్తంలో లాభాలు వస్తాయన్న ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.