ETV Bharat / crime

3 రోజుల నుంచి తమ్ముడు కలవలేదని ఇంట్లోకి వెళ్లి చూస్తే.. అన్న షాక్..!​

author img

By

Published : Nov 14, 2021, 10:21 PM IST

"తమ్ముడు ఊరెళ్లి వచ్చి మూడు రోజులైంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలవలేదు. అసలు వీడు ఎటు పోయుంటాడు..? ఓసారి వాడి ఇంటికి పోయి చూసొద్దాం" అని తమ్ముని ఇంటికి వెళ్లిన ఆ అన్నకు దిమ్మతిరిగిపోయింది. ఆ అన్న ఏం చూశాడు..? తమ్ముడు ఏ స్థితిలో కన్పించాడు..? అసలు ఆ అన్నదమ్ముల కథేంటి..?

dead body in house for three days in jamidi village adilabad district
dead body in house for three days in jamidi village adilabad district

రోజూ కలిసే వ్యక్తి ఓ రోజు కనిపించకపోతేనే.. ఆరా తీస్తాం. అలాంటిది తన తమ్ముడు మూడు రోజులుగా తనను కలవట్లేదు. మరీ ఆ అన్నకు తెలుసుకోవాలని ఉండదా..? అసలు ఏమైంది..? తమ్ముడు ఎందుకు కలవట్లేదో... తెలుసుకుందామని ఇంటికి పోయిన అన్న తమ్మున్ని చూసి షాక్​ అయ్యాడు. అలాంటి దృశ్యం చూస్తానని ఆ అన్న కలలో కూడా ఊహించలేదు. ఆ అన్న ఏం చూశాడో తెలుసుకోవాలంటే.. మొదట ఆ తమ్ముని కథ తెలుసుకోవాల్సిందే..

రెండేళ్లుగా మద్యానికి బానిసై..

ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం జామిడి గ్రామానికి చెందిన వ్యక్తి హారన్ సందీప్. అతడికీ.. మహారాష్ట్రలోని మలక్​వాడికి చెందిన ప్రతిభతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇంటి వద్దే కిరాణా దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహమై ఎనిమిదేళ్లు గడిచినా సందీప్​కు సంతానం కలగలేదు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. ఇంకెన్ని మందులు వాడినా.. సందీప్​ దంపతులకు మాత్రం సంతానభాగ్యం కలగలేదు. పిల్లలు పుట్టటం లేదన్న బాధతో.. రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు సందీప్​.

dead body in house for three days in jamidi village adilabad district
సందీప్(మృతుడు)​

భార్య దగ్గరికి వెళ్లొచ్చాక...

మొన్నటి దీపావళి పండుగకు భార్య ప్రతిభ పుట్టింటికి వెళ్లింది. అనంతరం సందీప్​ కూడా.. ఈ నెల 9న భార్యను చూసేందుకు మలక్​వాడి వెళ్లాడు. అక్కడే రెండు రోజులు ఉండి.. తిరిగి ఈ నెల 11న ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి సందీప్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. తన అన్న రాజేందర్​ను కూడా కలవలేదు. తన భార్యకు కూడా ఫోన్​ కూడా చేయలేదు.

హతాశుడైన అన్న..

ఇదిలా ఉండగా.. తమ్ముడిని కలిసొద్దామని శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సందీప్​ ఇంటికి రాజేందర్​ వెళ్లాడు. ఆ సమయంలో సందీప్​ ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. ఇదేదో తేడా కొడుతుందనుకున్న రాజేందర్ ఇంట్లోకి వెళ్లి చూశాడు. ఇంట్లోకి వెళ్లి చూసిన రాజేందర్​కు కళ్లు బైర్లుకమ్మాయి. మంచంలో కుళ్లిపోయి.. ఉబ్బిపోయి.. (deadbody in house)గుర్తుపట్టలేని స్థితిలో తమ్ముని మృతదేహం కనిపించింది. అది చూసి.. రాజేందర్​ షాక్​కు గురయ్యాడు.

పలు కోణాల్లో దర్యాప్తు..

షాక్​ నుంచి తేరుకుని.. వెనువెంటనే సందీప్​ భార్య ప్రతిభకు ఫోన్​ చేసి విషయం చెప్పాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ఉదయ్​కుమార్.. మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. పిల్లలు లేరనే బెంగతోనే మద్యానికి బానిసయ్యాడని(Addicted to alcohol).. ఈ క్రమంలోనే అతిగా సేవించి మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు అతిగా మద్యం తాగే చనిపోయాడా..? లేదా.. ఆత్మహత్య చేసుకున్నాడా..? ఇంకేదైనా కారణం ఉందా..? లాంటి కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.