ETV Bharat / crime

Online lottery cheating: రూ. 2.5 కోట్ల లాటరీ పేరుతో లూటీ.. 13 లక్షలు దోపిడీ

author img

By

Published : Nov 28, 2021, 5:47 PM IST

కొన్నేళ్ల క్రితం లాటరీ విధానం ఉండేది. ఓ వందో, వెయ్యి మందో లాటరీ టికెట్​ కొనుక్కుంటే అందులో ఒక అదృష్టవంతుడి పేరు లక్కీ డ్రాలో వచ్చేది. అతని పంట పండి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యేవాడు. ఇదంతా ఒక ప్రక్రియగా జరిగిపోయేది. ఆ డ్రాలో మనం పాల్గొంటేనే మన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా ఆన్​లైన్​ యుగం. కార్యకలాపాలన్నీ ఆన్​లైన్​ ద్వారానే సాగిపోతున్నాయి. సాంకేతికతను అంతగా వినియోగించుకుంటున్న జనం.. అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తున్నారు. మీకు ఆన్​లైన్​ లాటరీ వచ్చిందనో, ఆఫర్​ తగిలిందనో ఎవరైనా ఫోన్​ చేస్తే.. కనీసం లాజిక్​ ఆలోచించకుండా నిజమేనని నమ్మేసి వాళ్లు చెప్పిందల్లా చేస్తున్నారు. అడిగిందల్లా ఇస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీలో లాటరీ(Online lottery cheating) బుట్టలో పడి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది.

online lottery cheating
ఆన్​లైన్​ లాటరీ చీటింగ్​

Online lottery cheating: ఆన్​లైన్​ లాటరీ పేరుతో ఓ యువతిని నమ్మించి.. రూ. 13 లక్షలకు పైగా దోచుకున్నాడు ఓ సైబర్​ నేరగాడు. ఇల్లు, పొలం తాకట్టు పెట్టి.. ఉన్నదంతా ఊడ్చి ఇచ్చిన యువతి.. మోసపోయినట్లు తెలుసుకుని.. ఇంట్లో చెప్పలేక సతమతమైంది. చుట్టుపక్కల తెలిస్తే పరువు పోతుందని.. పోలీసులను ఆశ్రయించే ధైర్యం లేక ప్రాణాలు తీసుకునేందుకు యత్నించింది. ఏపీలోని చిత్తూరు(cheating in the name of lottery) జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్​లైన్​లో రూ. 2.5 కోట్లు లాటరీ గెలుచుకున్నారంటూ.. ఆ యువతికి డబ్బు వల విసిరిన విదేశీ సైబర్​ నేరగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. ఉగాండాకు చెందిన ఆ నిందితుడిని పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు.

Cyber Crime Compliant: 'క్షణాల్లో సమస్య పరిష్కరిస్తామని.. లక్షల్లో కాజేశారు'

లాటరీలో 2.5 కోట్లు వచ్చాయని..

ఆన్‌లైన్‌ లాటరీ(cheating in the name of lottery in Chittoor)లో రూ.2.5 కోట్లు వచ్చాయని చిత్తూరు జిల్లాకు చెందిన యువతికి గత ఏడాది అక్టోబరులో యుగాండాకు చెందిన నెల్సన్​ హూగ్లర్​ అలియాస్​ జాన్​ ఫోన్ చేశాడు. నిజమే అనుకుని నమ్మిన యువతి.. ఆ డబ్బు కావాలని అడిగింది. లాటరీ డబ్బు పొందాలంటే ముందుగా కొంత సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని మోసగాడు నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మన యువతి ఇల్లు, పొలం కుదవపెట్టి దశల వారీగా రూ.13,78,890 నిందితుడి ఖాతాలో జమచేసింది. రోజులు గడుస్తున్నా లాటరీ సొమ్ము రాకపోగా.. అటునుంచి స్పందన కురవైంది. మోసపోయానని గ్రహించిన యువతి.. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రత్యేక బృందం ఏర్పాటు..

ఎస్పీ సెంథిల్ కుమార్, పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. నగిరి ఇన్​స్పెక్టర్ మద్దయ్యచారి ఆద్వర్యంలో దిల్లీ వెళ్లిన బృందం అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు సమయంలో హైడ్రామా..

నిందితుడిని అదుపులోకి తీసుకనే సమయంలో హైడ్రామా నడిచింది. పోలీసులను గమనించిన నిందితుడు ఇంట్లోకి వెళ్లి గేటుకు తాళం వేసుకున్నాడు. పోలీసులు హెచ్చరించినా గేటు తెరవకపోవటంతో గ్యాస్ కట్టర్ సాయంతో గేటును తొలగించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్​పై విచారణ కోసం నిందితుడిని దిల్లీ నుంచి చిత్తూరుకు తీసుకువచ్చారు.

ఇదీ చదవండి: Shilpa Chowdary Case Update: కోట్లు తీసుకుని బెదిరింపులు.. శిల్పాచౌదరిపై మరో కేసు నమోదు

Online fraud news: రూ. 1500కే స్మార్ట్​ ఫోన్​.. మీకు ఇలా ఫోన్​ వచ్చిందా.. అయితే జాగ్రత్త.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.