పోలీసులకూ తప్పని ఫేక్ కష్టాలు.. సీపీ పేరిట నకిలీ వాట్సాప్​ అకౌంట్

author img

By

Published : Sep 26, 2022, 4:01 PM IST

Updated : Sep 26, 2022, 4:44 PM IST

rachakonda cp mahesh bagavath

CP FAKE WHATSAPP: సామాన్యుడు నుంచి పోలీసు అధికారులకు కూడా సైబర్​ నేరగాళ్ల తలనొప్పి వదలడం లేదు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ఫొటోను ప్రొఫైల్ పిక్​గా పెట్టుకొని సైబర్​ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ సృష్టించారు. వెంటనే స్పందిన సీపీ ఆ నంబర్​తో వచ్చే ఎటువంటి సందేశాలను నమ్మవద్దని తెలిపారు.

CP FAKE WHATSAPP: సైబర్ నేరగాళ్లు పోలీసు ఉన్నతాధికారులనూ వదలడం లేదు. ఉన్నతాధికారుల ఫొటోలు ఉపయోగించుకుని నకిలీ ఖాతాలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ఫొటోను ప్రొఫైల్​పిక్​గా పెట్టుకుని నకిలీ వాట్సాప్ సృష్టించారు. ఈ నంబర్ నుంచి కొంతమంది అధికారులకు సందేశాలు పంపించారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. తన పేరిట నకిలీ వాట్సాప్ ఏర్పాటు చేశారని ఆ నంబర్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించొద్దని మహేశ్​ భగవత్ కోరారు. ఇప్పటికే ఆ నంబర్​​ను రిపోర్టు చేస్తూ వాట్సాప్​కు సందేశాలు వెళ్లాయి. వెంటనే బ్లాక్ చేయాల్సిందిగా వాట్సాప్ ప్రతినిధుల దృష్టికి రాచకొండ ఐటీ విభాగం అధికారులు తీసుకెళ్లారు.

రాచకొండ సీపీ నకిలీ వాట్సాప్​
రాచకొండ సీపీ నకిలీ వాట్సాప్​

ఇవీ చదవండి:

Last Updated :Sep 26, 2022, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.