ETV Bharat / crime

పోలీసులు కొట్టారని మానవహక్కుల కమిషన్​లో ఫిర్యాదు

author img

By

Published : Apr 1, 2021, 10:13 PM IST

ఓ కేసు విషయంలో తనను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. సికింద్రాబాద్​లోని ఆల్వాల్ లోతుకుంటాకు చెందిన అతను భార్యకు విడాకుల విషయంలో రూ.15 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో భూపాలపల్లి పోలీసులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

complaint in shrc
మానవహక్కుల కమిషన్​

భార్య విడాకుల కేసు విషయంలో భూపాలపల్లి పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని సికింద్రాబాద్​లోని ఆల్వాల్​కు చెందిన రేవంత్... రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు. అల్వాల్ లోతుకుంటాకు చెందిన రేవంత్ 2019 డిసెంబర్​లో భూపాలపల్లికు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నట్లు కమిషన్​కు తెలిపారు. పెళ్లయ్యాక కొన్నాళ్లకే ఇంట్లో తరచూ గొడవ జరిగేదని పేర్కొన్నారు. ఈ విషయమై పెద్దల ముందు మాట్లాడితే... తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రూ.15 లక్షలు చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారని ఆరోపించారు.

విచారణ పేరుతో దాడి చేశారు:

అంత డబ్బులు చెల్లించలేనని చెప్పడంతో... తన భార్య కుటుంబ సభ్యులు భూపాలపల్లి పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసు విషయంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని పిలవడంతో గత నెల 23న పోలీస్​ స్టేషన్​కు వెళ్లినట్లు వివరించారు. విచారణ పేరుతో ఎస్సై నరేశ్​, కానిస్టేబుల్స్ తనను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులందరిపై కేసులు నమోదు చేస్తానని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. తప్పు చేస్తే తనను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపకుండా సెటిల్​మెంట్ చేసుకోవాలని దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను రేవంత్ కోరారు.

ఇదీ చూడండి: గో మహాగర్జనలో అగ్నిప్రమాదం... దగ్ధమైన గుడారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.