వాహన పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరికి గాయాలు

వాహన పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరికి గాయాలు
Clash between rowdy sheeters in Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో రౌడీ షీటర్లు చెలరేగిపోతున్నారు. వారు తరుచు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు. ఈ గొడవలు కారణంగా కొంత మందికి గాయాలవుతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. పోలీసులు ఎంత బెదిరించిన వారు గొడవలు పడడం మాత్రం ఆపరు. ఇలాంటి ఘటనే పాతబస్తీలో జరిగింది.
Clash between rowdy sheeters in Hyderabad: హైదరాబాద్లో చిన్న విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్ జిల్లా పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కస్ సలార్ ప్రాంతంలో వాహన పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. స్థానికంగా ఉండే అలీ తమ్ముడికి, సులేమాన్ అనే రౌడీ షీటర్కి మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది.
స్థానికులు ఇరు వర్గాల వారిని ఎంత నియంత్రించిన వారు గొడవ ఆపలేదు. సమాచారం అందుకున్న వచ్చిన పోలీసులు వారిని వారించినా గొడవ ఆగలేదు. ఇదే సమయంలో అలీ.. సులేమన్పై కత్తితో దాడి చేశాడు. దీంతో సులేమన్ చేతికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
