ETV Bharat / crime

CBI raids in Nalgonda: పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ దాడులు.. ఏం జరిగిందంటే..

author img

By

Published : Mar 9, 2022, 8:04 PM IST

Updated : Mar 9, 2022, 10:23 PM IST

CBI raids in Nalgonda
నల్గొండ జిల్లాలో సీబీఐ దాడులు

CBI raids in Nalgonda: నల్గొండ జిల్లా పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ అధికారులు దాడులు జరిపారు. సుమారు రూ.1.62 కోట్ల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై పోస్టల్ ఉద్యోగిపై కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

CBI raids in Nalgonda: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ దాడులు జరిపింది. సుమారు రూ.1.62 కోట్ల అక్రమాలకు పాల్పడిన అభియోగంతో చింతపల్లి మాజీ సబ్ పోస్ట్​మాస్టర్​ కె.నరేశ్‌కుమార్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.

తక్కల్‌పల్లి, కుర్మేడ్ బ్రాంచ్​ల పోస్టాఫీస్‌లతో సహా.. పలు బీపీఎంల నుంచి సామాజిక భద్రత పెన్షన్ ఖాతాలకు సంబంధించిన విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో... సీబీఐ దర్యాప్తు చేపట్టింది. పింఛన్లు, ఉపాధిహామీ నిధుల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

బీపీఎంఎస్​లో మార్పులు చేసి...

నిందితుడు తన కంప్యూటర్ ఐడీలోని బీపీఎంఎస్ నివేదికలో మార్పులు చేసి... అవి వివిధ బ్రాంచ్​ల నుంచి వచ్చినట్లు చూపి.. నగదు డ్రా చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. నివేదికలో మార్పుల ద్వారా రూ.1,62,50,000/- నిందితుడు అపహారించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొంది.

ఇదీ చదవండి:సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం

Last Updated :Mar 9, 2022, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.