ETV Bharat / crime

గుప్తనిధుల జాడ చెబుతానని.. అందినకాడికి దోచుకెళ్లాడు...

author img

By

Published : May 24, 2022, 1:09 PM IST

Updated : May 24, 2022, 2:10 PM IST

Astrologer Fraud
Astrologer Fraud

Astrologer Fraud: రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ మధ్యతరగతి వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. జ్యోతిష్కులు, దొంగ బాబాలు, మోసగాళ్లు చెప్పే మాటలు విని ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు దురాశకు పోయి ఉన్నదంతా పొగొట్టుకుని లబోదిబోమంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Astrologer Fraud: అమాయకపు మహిళలను ఆసరాగా చేసుకుని గుప్తనిధుల పేరిట.. ఓ జ్యోతిష్కుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్​పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధన్ మండలం ఏరాజ్​పల్లిలో నెల క్రితం ఓ జ్యోతిష్కుడు జాతకం చెప్పడానికి వచ్చాడు.

ఊరిలో ఒక ఇంట్లో జాతకం చెబుతున్న అతడిని చూసి ఓ మహిళ అక్కడికి వెళ్లింది. ఆమెను చూసిన ఆ జ్యోతిష్కుడు నీకు బాధలున్నాయమ్మా జాతకం చెప్పాలి అనగానే గుడ్డిగా నమ్మిన ఆ మహిళ అతడిని ఇంటికి తీసుకెళ్లింది. జాతకం చెప్పిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే ఫోన్ చేయమని మొబైల్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటే ఆ జ్యోతిష్కుడికి ఫోన్ చేసింది. దొరికిందే అదునుగా ఆ మోసగాడు మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని మాయ మాటలు చెప్పాడు. వాటి కోసం పూజలు చేయాలని.. దానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని నమ్మబలికాడు. ఆ నిధులు దొరికితే కోటీశ్వరురాలు అవుతాము అనుకుందో ఏమో.. కట్టుకున్న భర్తకు కూడా తెలియకుండా ఆ మాయగాడికి సుమారు రూ.4 లక్షల రూపాయలు గూగుల్ పే చేసింది.

పూజలు చేశాక ఎన్ని రోజులకీ ఆ గుప్తనిధులు కనిపించలేదు. దాంతో జ్యోతిష్కుడికి ఫోన్ చేయగా కలవకపోవడంతో చివరకు మోసపోయానని గ్రహించిన మహిళ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. జ్యోతిష్కుడిగా వచ్చిన ఆ ఘరానా మోసగాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:‘నిన్ను మర్చిపోవాలంటే.. నేను చచ్చిపోవాలి’

Last Updated :May 24, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.