ETV Bharat / crime

కొనిజర్లలో విషాదం.. పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

author img

By

Published : May 22, 2021, 9:48 AM IST

ఖమ్మం జిల్లా కొనిజర్లలో విషాదం చోటు చేసుకుంది. ఉరుములు మెరుపుల వర్షం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గొర్రెలు మేపడానికి వెళ్లిన కనకయ్య అనే వ్యక్తి పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.

a man dead with Lightning strikes, konijerla death
పిడుగుపడి వ్యక్తి మృతి, కొనిజర్లలో పిడుగు పడి వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా కొనిజర్లలో పిడుగు పడి గొర్రెల కాపరి రొట్టె కనకయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురవడం వల్ల గొర్రెలు చెట్టు కిందకు చేరాయి. కనకయ్య వాటితోపాటే చెట్టుకింద నిలబడ్డారు.

అదే సమయంలో పిడిగు పడి కనకయ్య అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఇంటి పెద్దను కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి... పెళ్లికి ఒప్పుకోలేదని గొంతుకోశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.