ETV Bharat / crime

ప్రియురాలి బంధువుల దాడి.. ప్రియుడి ఆత్మహత్య

author img

By

Published : Apr 12, 2021, 8:29 PM IST

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలి బంధువులు ప్రియుడి ఇంటిపై దాడి చేయడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ చావుకు కారణం అమ్మాయి బంధువులని ఆరోపిస్తూ... ప్రియుడి కుటుంబ సభ్యులు యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

Boyfriend committed suicide in suryapet district
ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

ప్రియురాలి బంధువులు ప్రియుడి ఇంటిపై దాడి చేయడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలకు చెందిన లింగం నరేశ్‌ అదే గ్రామానికి చెందిన బిందు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి బంధువులు నరేశ్‌పై ఇంటిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన ప్రియుడు పురుగుల మందు తాగి మరణించాడు.

మృతదేహంతో యువకుడి బంధువులు బిందు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రియురాలి ఇంటి ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ బిడ్డ చావుకు కారణం యువతి బంధువులని ఆరోపించారు. గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ‘గసగసాల’ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.