ETV Bharat / crime

కన్నకూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్..!​

author img

By

Published : Oct 26, 2022, 10:50 AM IST

Father killed Daughter in Vanaparthi: సాధారణంగా అమ్మకు కొడుకు అంటే ఇష్టం.. నాన్నాకు కూతురు అంటే ఇష్టం అంటుంటారు. కూతరికి ఏ కష్టం వచ్చినా తండ్రి తల్లడిల్లిపోతాడు. ఆడపిల్ల పుట్టింది మొదలు.. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే వరకు నాన్న పడే శ్రమ అంతా ఇంతా కాదు. తన కూతురికి కాస్త నలత చేస్తేనే తండ్రి తట్టుకోలేడు. నయమయ్యే దాకా మామూలు మనిషి కాలేడు. అంతలా ప్రేమ చూపిస్తాడు తండ్రి. కానీ వనపర్తి జిల్లాలో తన మాట వినకుండా ఓ అబ్బాయితో స్నేహం చేస్తోందని తన కూతురినే నరికి హత్య చేసిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది.

father killed his own daughter
father killed his own daughter

Father killed Daughter in Vanaparthi: కన్నబిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. కాస్త నలత చేస్తేనే వారు తట్టుకోలేరు. నయమయ్యేదాకా మామూలు మనుషులు కాలేరు. అలాంటిది ఓ తండ్రే పదిహేనేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి దారుణంగా చంపాడు. ఒకటికాదు..రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు వేటువేశాడు.

తీవ్రంగా గాయపడిన బాలిక రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. తాను వద్దని చెప్పినా వినకుండా ఒక అబ్బాయితో స్నేహంగా ఉండటమే ఆ తండ్రి ఆగ్రహానికి కారణమైంది. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

పాతపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు రాజశేఖర్‌, సునీత, దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె గీత (15) పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడితో బాలిక సన్నిహితంగా మెలగడాన్ని తండ్రి రాజశేఖర్‌ గుర్తించి పలుమార్లు మందలించాడు.

కుటుంబ పరువు పోగొట్టవద్దని..బుద్ధిగా చదువుకోవాలని చెప్పాడు. మంగళవారం బాలిక తల్లి పొలం పనులకు వెళ్లారు. మరో కుమార్తె, కుమారుడు కూడా ఇంట్లో లేరు.ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి మరోమారు కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై, విచక్షణ కోల్పోయిన తండ్రి కుమార్తె మెడపై గొడ్డలితో దాడిచేశాడు.

దాంతో గీత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. అనంతరం పోలీసుస్టేషన్‌లో తండ్రి లొంగిపోయినట్లు సమాచారం. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, ఆత్మకూరు సీఐ కేఎస్‌.రత్నం, ఎస్సైలు రామస్వామి, వహీద్‌ అలీబేగ్‌లు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ ఆనంద్‌రెడ్డి చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.