ETV Bharat / city

హుజూరాబాద్‌లో గొప్ప విజయం సాధించబోతున్నాం: మంత్రి హరీశ్‌రావు

author img

By

Published : Oct 30, 2021, 10:45 PM IST

minister harish rao
minister harish rao

22:08 October 30

హుజూరాబాద్‌లో గొప్ప విజయం సాధించబోతున్నాం: మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస గొప్ప విజయం సాధించబోతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించారని హరీశ్​ పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటు హక్కును వినియోగించుకోవడం వారి చైతన్యానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఓటర్లకు హరీశ్​రావు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ మార్గదర్శకం.. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఘనవిజయం సాధించబోతున్నామన్నారు.  

హుజూరాబాద్​ ఉపఎన్నికలో అధికార తెరాస తరఫున మంత్రి హరీశ్​రావు అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​రావును వెంటబెట్టుకొని వీధి వీధి తిరిగారు. ఈటల వెంట ఎవరూ వెళ్లకుండా వ్యూహరచన చేశారు. 

ఇదీచూడండి:  Bandy sanjay: 'తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.