ETV Bharat / city

పెద్దపల్లిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్, ఇసుక రీచ్​ల ముడుపులపై లొల్లి

author img

By

Published : Oct 2, 2022, 9:44 AM IST

EX MLA vijaya ramanarao arrest: ఇసుక అక్రమ రవాణా విషయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న విభేదాలు తారస్థాయికి చేరాయి. రీచ్​ యజమానుల నుంచి ఎమ్మెల్యే ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేసేందుకు వచ్చిన రమణారావును పోలీసులు అరెస్ట్​ చేశారు.

EX MLA vijaya ramanarao
మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

EX MLA vijaya ramanarao arrest: ఇసుక అక్రమ రవాణా విషయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అరెస్టయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనితో ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు మధ్య జరుగుతున్న విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇరు వర్గాల మధ్య బాహ్యంగానే గొడవలు జరుగుతుండేవి.

మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్​
మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్​

పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు వాగుపై ఇటీవల ఇసుక రీచ్​లు ప్రారంభమయ్యాయి. కాగా ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దమ్ముంటే ఇసుక రీచ్ యజమానుల వద్ద డబ్బులు తీసుకోలేదని మల్లికార్జున స్వామి వద్ద ప్రమాణం చేయాలంటూ సవాలు విసిరారు.

నేను కూడా డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తున్నానని ఆలయం వద్ద దేవుడి చిత్రం పటం పట్టుకొని ప్రమాణం చేసే క్రమంలో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బలవంతంగా విజయరామారావును అక్కడి నుంచి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.