ETV Bharat / city

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి

author img

By

Published : Oct 13, 2022, 6:56 PM IST

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి
నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి

Dastagiri Comments on his Security: తనకు ప్రాణభయం ఉందని.. ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని అన్నారు.

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి

Dastagiri Comments on his Security: నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి పేర్కొన్నాడు. తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ పులివెందులలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులంతా సీఎం చెప్పినట్లే వింటారని.. అవినాశ్​రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ అందరూ ఒకే కుటుంబం అని అన్నారు. వివేకా కేసు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని.. తనను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందన్నాడు. పెద్దవాళ్లనే కీలుబొమ్మలను చేసి ఆడిస్తున్నారని.. అలాంటి వారికి తాను లెక్క కాదన్నాడు. తనకు ప్రాణభయం ఉందని.. రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపాడు. గన్‌మెన్లను ఎందుకు మార్చారని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. నా వ్యాఖ్యలు అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. సమస్య తనదని.. ఏం కుట్ర జరుగుతుందో తనకు తెలుసునని ఆవేదన వ్యక్తం చేశాడు.

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత. నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు. వారికి నేను లెక్క కాదు. నాకు ప్రాణభయం ఉంది. రక్షణ కల్పించాలని కోరుతున్నా. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో నాకు తెలుసు.-దస్తగిరి

మరోసారి కడప ఎస్పీకి ఫిర్యాదు : తనకు ఎదురవుతున్న ముప్పు గురించి దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయంలో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట తన ఇంటి పెంపుడు కుక్క చనిపోయిందని.. వాటిలో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు దస్తగిరి వ్యక్తం చేశారు. ఈ నెల 2న తన ఇంటి పెంపుడు కుక్క చనిపోయిందని.. 6న గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తన ఇంటి వద్దకు వచ్చి.. కుక్కను కొంటామని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇంటివద్ద లేని సమయం చూసి.. కుక్కను అడిగి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్క చనిపోవడం, ఆరుగురు వ్యక్తులు ఇంటికి రావడం చూస్తే ఏదో అనుమానం కలుగుతోందని.. వాటిపై విచారణ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు దస్తగిరి ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల కిందటే తన గన్​మెన్​ల మార్పు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేసిన దస్తగిరి.. ఇప్పుడు మళ్లీ మరో ఫిర్యాదు అందజేయడం చర్చనీయాంశమైంది. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ కడపలోని సీబీఐ అధికారులకు కూడా లేఖ అందజేశారు. సీబీఐ అధికారులతో ఇంకా చాలా విషయాలను దస్తగిరి వివరించినట్లు తెలిసింది. అనంతరం కడప నుంచి పులివెందుల వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన వీర శునకం మృతి

మద్యం, కోళ్లను పంపిణీ చేసిన తెరాస నేతకు.. ఈసీ షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.