ETV Bharat / city

ఏపీలో ఒంగోలుకు తందూరి చాయ్​ రుచి చూపించాడు!

author img

By

Published : Dec 19, 2020, 1:48 PM IST

ఆరోగ్యకరమైన కొత్త రుచులకు వినియోగదారులు ఎల్లప్పుడూ ఆకర్షితులవుతుంటారు. ఇదే సూత్రాన్ని పాటించిన ఓ యువకుడు.... మెట్రో నగరాల్లో దొరికే తందూరి చాయ్​ని ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజలకు పరిచయం చేశాడు. ఈ తేనీరు రుచిని ఆస్వాదించడానికి పట్టణవాసులు వరుస కడుతున్నారు.

young-man-running-a-tandoori-chai-stall-in-ongole
ఒంగోలుకు తందూరి ఛాయ్​ రుచి చూపించాడు

మెట్రో నగరాల్లో వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతోంది తందూరి చాయ్. మంచి రుచి, ఆరోగ్యకరం కావటడంతో దీనిని తాగేందుకు ఛాయ్ ప్రియులు క్యూ కడుతున్నారు. ఈ తేనీరు రుచిని ఏపీలోని ఒంగోలు వాసులకు పరిచయం చేశాడు అదే పట్టణానికి చెందిన రాజేష్. ఎంబీఎ చదివిన ఇతను... ఇటీవలే మంగమూరు రోడ్డులో టీ స్టాల్‌ను ప్రారంభించాడు.

ఒంగోలుకు తందూరి ఛాయ్​ రుచి చూపించాడు!

చిన్నపాటి మట్టి కూజాను అగ్ని కొలిమిలో వేడి చేసి, ఆ తరువాత మసాలా టీని అందులో పోసి మట్టి కప్పులలో వినియోగదారుడికి అందిస్తున్నాడు. ఈ మట్టి కప్పును ఒకసారి మాత్రమే వినియోగిస్తున్నాడు. గుజరాత్ నుంచి వీటిని తెప్పిస్తున్నారు. అంతేకాకుండా ఒక్కో చాయ్​ను కేవలం 15 రూపాయలకే విక్రయిస్తున్నాడు. దీని రుచి చూసేందుకు ఒంగోలు వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదీ చదవండి : తందూరి ఛాయ్​ని టేస్ట్​ చేసిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.