ETV Bharat / city

గీతాఆర్ట్స్​ ఆఫీస్​ ముందు మరోసారి మహిళా ఆర్టిస్టు ఆందోళన..

author img

By

Published : May 31, 2022, 6:58 PM IST

గీతా ఆర్ట్స్​కు మహిళా జూనియర్​ ఆర్టిస్ట్​ నుంచి నిరసన సెగ తప్పటం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేసిన సదరు మహిళా ఆర్టిస్ట్​.. మరోసారి నిరసనకు దిగింది. ఈ నెలలోనే నగ్నప్రదర్శన చేస్తూ హంగామా చేసిన సదరు మహిళ.. మరోసారి గీతాఆర్ట్స్​ కార్యాలయం ముందు బైఠాయించింది.

గీతా ఆర్ట్స్ ముందు జూనియర్​ ఆర్టిస్ట్​ సునీత మరోసారి ఆందోళనకు దిగింది. ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచిన సునీత.. మరోసారి గీతా ఆర్ట్స్​ కార్యాలయం ముందు మళ్లీ నిరసనకు దిగింది. నిర్మాత బన్నీవాసు​ తనను మోసం చేశాడంటూ.. గేటు ముందు బైఠాయించింది. కార్యాలయ సిబ్బంది హామీ ఇచ్చినా వినకుండా.. అక్కడే బీష్మించుకు కూర్చింది. పోలీసులు వచ్చి ఎంతగా నచ్చజెప్పినా లాభలేకపోయింది. గేటు పట్టుకుని వదలకుండా.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.

గతంలో కూడా నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని.. సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఫిలిం ఛాంబర్ వద్ద సునీత నిరసన వ్యక్తం చేసింది. క్యాస్టింగ్​ కౌచ్​కు పాల్పడుతున్నారంటూ.. బన్నీవాసుతో పాటు కత్తిమహేశ్​పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. గతేడాది గీతాఆర్ట్స్​ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసి హల్చల్​ చేసింది. అప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగాలేదని తెలిపారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స సైతం అందించారు.

ఇదిలా ఉండగా.. ఇదే నెల 9న మళ్లీ గీతా ఆర్ట్స్​ కార్యాలయం ముందు సునీత ఆందోళన చేసింది. రోడ్డుపై నగ్న ప్రదర్శన ద్వారా నిరసనకు ప్రయత్నించి.. హంగామా చేసింది. బన్నీవాసు తనను మోసం చేశాడని.. సినిమాల్లో అవకాశం ఇస్తానని లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. మహిళా పోలీసులు వచ్చి.. ఆమెను అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆందోళనకు దిగటంతో.. ఇన్నిసార్లు ఓ మహిళ నిరసన తెలపటంపై చర్చ మైదలైంది. ఇదే విషయమై గీతా ఆర్ట్స్​ గతంలోనే ఓ స్పష్టత ఇచ్చింది. సదరు మహిళకు ఒక్క రూపాయి బకాయి లేదని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.