ETV Bharat / city

Ayesha Meera Case: నార్కో పరీక్షలపై సీబీఐ పిటిషన్.. తోసిపుచ్చిన న్యాయస్థానం

author img

By

Published : Sep 22, 2021, 6:07 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో(Ayesha Meera Case) సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీలోని విజయవాడ కోర్టు కొట్టేసింది. ఈ హత్యకేసులో అనుమానితులకు నార్కో పరీక్షలపై ఇవాళ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీశ్​, మరో ఏడుగురిపై నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు పిటిషన్‌(cbi plea to conduct narco analysis test news) దాఖలు చేశారు.

Ayesha Meera Case
ఆయేషా మీరా హత్యకేసు

ఆయేషా మీరా కేసు(Ayesha Meera Case)లో అనుమానితులకు నార్కో పరీక్షల (cbi plea to conduct narco analysis test news)పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ వేసిన పిటిషన్​ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 2007 డిసెంబరు 27న హత్యకు గురైన ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీశ్, మరో ఏడుగురిపై నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కోనేరు సతీశ్​తో పాటు.. హాస్టల్లో ఆయేషా మీరాతో ఉన్న స్నేహితురాళ్ల సమాచారం కీలకమని.. వారికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు అవసరమని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది.

అయేషా మీరా కేసు.. అసలేం జరిగింది.!

అయేషామీరాపై అత్యాచారం(Ayesha Meera Case), హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యాచారానికి కారకులెవరో తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగింది సీబీఐ(CBI). గతంలో ఆధారాలు ధ్వంసం కావడంతో రీ పోస్టుమార్టం నిర్వహించింది. తొలుత బాధిత కుటుంబం, ముస్లిం మతపెద్దల వ్యతిరేకతతో విజయవాడ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మహిళా కోర్టు నుంచి సీబీఐ అనుమతి పొందింది. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో.. అయేషామీరా సమాధిని అధికారులకు ఆమె తండ్రి చూపించారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో ఆ ప్రదేశాన్ని తవ్వారు. రీ పోస్ట్‌మార్టం ప్రక్రియను చేపట్టారు. అయితే ఈ కేసులో అనుమానితులకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ.. కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అయితే దీనిపై విచారిణ చేపట్టిన కోర్టు.. అనుమతికి నిరాకరిస్తూ పిటిషన్​ను కొట్టివేసింది.

ఇదీ చదవండి: Suicide For Dowry Gold: కన్నవారిపై అలిగింది.. కాటికి దారి చూసుకుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.