ETV Bharat / city

Vangaveeti Radha On Gunman: 'నాకు గన్‌మెన్లు వద్దన్న మాట వాస్తవమే'

author img

By

Published : Dec 28, 2021, 9:03 PM IST

Vangaveeti Radha On Gunman: తనకు గన్‌మెన్లు వద్దన్న మాట వాస్తవమేనని తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని అందుకే తనకు గన్​మెన్ల్​ వద్దన్నానని తెలిపారు.

Vangaveeti Radha
Vangaveeti Radha

Vangaveeti Radha On Gunman: తనకు గన్‌మెన్లు వద్దన్న మాట వాస్తవమేనని తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని అందుకే గన్​మెన్ల్​ వద్దన్నానని తెలిపారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్ చేసి అడిగారన్నారు.

తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ రాధా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని నిన్న (సోమవారం) సీఎం జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ..రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్‌ డీజీకి ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.