ETV Bharat / city

తెరాస కార్యకర్తల కోసమే నగదు రూపంలో వరద సాయం: యోగి

author img

By

Published : Nov 28, 2020, 8:26 PM IST

up cm yogi adithyanath campaigning in ghmc elections
తెరాస కార్యకర్తల కోసమే నగదు రూపంలో వరద సాయం: యోగి

నిజాం రూపంలో వస్తున్న నయా నిజాం పథకం పారనివ్వకూడదని నగర ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సూచించారు. ఎంఐఎంతో కలిసి తెరాస ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

తెరాస కార్యకర్తల కోసమే సర్కార్ వరద సాయం నగదు రూపంలో పంపిణీ చేసిందని... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ విమర్శించారు. గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. వరద బాధితుల ఖాతాల్లో నేరుకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిజాం రూపంలో వస్తున్న నయా నిజాం పథకం పారనివ్వకూడదని నగర ప్రజలకు సూచించారు.

ఎంఐఎంతో కలిసి తెరాస ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని యోగి ఆదిత్యనాథ్​ ఆరోపించారు. భాజపాకు అధికారం ఇస్తే హైదరాబాద్​ను భాగ్యనగరం చేస్తామని పునరుద్ఘాటించారు. ఎంఐఎం, తెరాస కలిసి మూసీని పూర్తిగా కబ్జా చేశాయని విమర్శించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన కోసం... భాజపాను గెలిపించి... నేరుగా దిల్లీ నుంచి నిధులు తెప్పించుకోవాలన్నారు.

హైదరాబాద్​ వాసుల ఉత్సాహం చూస్తే చాలా ఆనందంగా ఉందని యోగి అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం సర్దార్​ పటేల్​తో సాకారమైందన్న యోగి... దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టికల్-370 తొలిగింపు, రామమందిరం నిర్మాణం వంటి కార్యక్రమాలు... మోదీ, అమిత్​ షా చేశారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేసీఆర్​ ఇళ్లు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్​లో పేదలకు 15 లక్షల ఇళ్లు ఇచ్చినట్టు వెల్లడించారు.

తెరాస కార్యకర్తల కోసమే నగదు రూపంలో వరద సాయం: యోగి

ఇదీ చూడండి: గ్రేటర్​లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్​ షో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.