ETV Bharat / city

TRS Maha Dharna: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తెరాస ప్రతినిధి బృందం

author img

By

Published : Nov 18, 2021, 11:28 AM IST

Updated : Nov 18, 2021, 3:10 PM IST

trs maha dharna
trs maha dharna

15:09 November 18

ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

  • త ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి 
  • రాష్ట్రంలో 59 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు కేంద్రం చెప్పింది
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రైతులకు శరాఘాతమైంది: మంత్రి నిరంజన్‌ రెడ్డి 
  • ఇప్పటికే సీజన్‌ వచ్చినందున నిర్ణయంలో జాప్యం చేయొద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి 
  • కేంద్రం, భాజపా ప్రతినిధులు పూటకోరకంగా మాట్లాడుతున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి 
  • తెలంగాణ, ఏపీలో మాత్రమే యాసంగిలో వరి పండిస్తారు: మంత్రి నిరంజన్ రెడ్డి 
  • రెండు రాష్ట్రాల వరిని కేంద్రం కొనలేదా?: మంత్రి నిరంజన్ రెడ్డి 
  • వరి వేయాలని భాజపా నేతలు రెచ్చగొడతారు: మంత్రి నిరంజన్ రెడ్డి 
  • వరి కొనేది లేదని కేంద్రం చెప్తోంది: మంత్రి నిరంజన్ రెడ్డి 

14:40 November 18

  • రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తెరాస ప్రతినిధి బృందం
  • ధాన్యం కొనుగోళ్లపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన నేతలు
  • రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి
  • బృందంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు

14:37 November 18

కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెరాస ప్రతినిధి బృందం

  • రాజ్‌భవన్ చేరుకున్న తెరాస ప్రతినిధి బృందం
  • ఆర్టీసీ బస్సులో రాజ్‌భవన్‌కు వచ్చిన తెరాస నేతలు
  • కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెరాస ప్రతినిధి బృందం
  • వడ్లను కేంద్రం కొనాలని వినతిపత్రం ఇవ్వనున్న తెరాస బృందం
  • కేశవరావు నేతృత్వంలో వినతిపత్రం ఇవ్వనున్న తెరాస బృందం

14:01 November 18

కాసేపట్లో గవర్నర్ తమిళిసైని కలవనున్న తెరాస ప్రతినిధి బృందం

  • వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని వినతిపత్రం ఇవ్వనున్న తెరాస బృందం
  • మ.2.30 గం.కు గవర్నర్‌ను కలవనున్న తెరాస ప్రతినిధి బృందం
  • గవర్నర్‌ను కలవనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

13:51 November 18

ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు: సీఎం

  • దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి: సీఎం
  • మేం తెచ్చిన సాగు విధానాలతో రాష్ట్ర రైతులోకం ఒక దరికి వచ్చింది: సీఎం
  • దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పనిచేయడం లేదు: కేసీఆర్
  • ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది: సీఎం
  • కేంద్రం తీరుతోనే ధాన్యం సాగు వద్దని చెప్పాం: సీఎం కేసీఆర్
  • ఇష్టం లేకున్నా వరి వేయొద్దని చెప్పాం: సీఎం కేసీఆర్
  • వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం: సీఎం కేసీఆర్
  • మా ఓపికకు ఓ హద్దు ఉంటుంది: సీఎం కేసీఆర్
  • ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట అడుగుతున్నా: సీఎం
  • వడ్లు కొంటారా? కొనరా? అని నిన్న కూడా లేఖ రాశా: కేసీఆర్
  • ధాన్యం కొంటామని ఇప్పటివరకు కేంద్రం హామీ ఇవ్వలేదు: సీఎం
  • యాసంగిలో ధాన్యం వద్దని మేం చెబితే వేయాలని భాజపా అంటుంది: సీఎం
  • ముఖ్యమంత్రి, మంత్రుల పదవుల కోసం మేం ఆరాటంపడం: కేసీఆర్
  • దేశంలోని రైతు సమస్యలపై తెరాస నాయకత్వం తీసుకుంటుంది: కేసీఆర్
  • దేశ రైతుల సమస్యల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తాం: సీఎం
  • రాష్ట్ర సాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నాం: సీఎం
  • ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు: సీఎం
  • సర్జికల్‌ స్ట్రైక్స్ వంటి నాటకాలు బయటికొచ్చాయి...ప్రజలకు తెలిశాయి: సీఎం

13:50 November 18

  • సాఫ్‌ సీదా ముచ్చట.... వడ్లు కొంటారా.. కొనరా..?: సీఎం
  • రైతులు కొత్త కోరికలు కోరడం లేదు: సీఎం కేసీఆర్
  • పండించిన పంట కొంటారా.. కొనరా అనే అడుగుతున్నారు: సీఎం
  • కేంద్రం అడ్డగోలు మాటలు మాట్లాడుతోంది: సీఎం కేసీఆర్
  • రైతుల గోస...తెలంగాణలోనే కాదు దేశ్యవ్యాప్తంగా ఉంది: సీఎం
  • ఏడాదిగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు: సీఎం
  • సాగు చట్టాలు వద్దని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు: సీఎం
  • నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోంది: సీఎం
  • దేశంలో 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి: సీఎం కేసీఆర్
  • దేశంలో అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు: సీఎం కేసీఆర్
  • బంగారం పండే భూములను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?: సీఎం
  • రైతులను బతకిస్తారా? బతకనివ్వరా?: సీఎం కేసీఆర్
  • భారత్‌ ఆకలి రాజ్యమని ఆకలి సూచీలో సూచిస్తోంది: సీఎం కేసీఆర్
  • ఆకలి సూచీలో పాకిస్తాన్‌ కంటే దిగువన భారత్‌ ఉంది: సీఎం కేసీఆర్
  • ఉత్తరభారత రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు: సీఎం
  • ఆందోళన చేస్తున్న రైతులపైకి కార్లు ఎక్కించి చంపుతున్నారు: సీఎం
  • దక్షిణ భారత్‌ వైపునకు వచ్చారు... రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతున్నారు: సీఎం

12:09 November 18

ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్

  • కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం
  • దేశాన్ని పాలిస్తున్న నాయకులు రకరకాల వితండవాదాలు చేస్తున్నారు: సీఎం
  • సీఎం, మంత్రులు ధర్నాలు చేయడమేంటనీ భాజపా అంటుంది: కేసీఆర్
  • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా దీక్ష చేశారు: కేసీఆర్
  • దేశంలో సీఎం, మంత్రులు కూడా ధర్నాలు చేయాల్సిన దుస్థితి: సీఎం
  • ఈ పోరాటం ఇక్కడితో ఆగదు: సీఎం కేసీఆర్
  • అవసరమైతే దిల్లీకి వెళ్లి యాత్ర చేయాల్సి ఉంటుంది: కేసీఆర్
  • ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది: సీఎం కేసీఆర్
  • కేంద్రం సమస్యను పరిష్కరిస్తే ధర్నాల అవసరం ఉండదు: సీఎం

11:32 November 18

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మహాధర్నా చేపట్టాం: నిరంజన్‌రెడ్డి

  • రాష్ట్ర రైతుల కోసం సీఎం ధర్నాలో కూర్చున్నారు: నిరంజన్‌రెడ్డి
  • కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది: నిరంజన్
  • రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయి: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం: నిరంజన్‌రెడ్డి
  • కేంద్ర అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం: నిరంజన్‌
  • రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసేలా రాష్ట్ర భాజపా నేతలు మాట్లాడుతున్నారు: నిరంజన్
  • అన్నీ వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి: నిరంజన్‌రెడ్డి
  • ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడంలేదు: నిరంజన్‌రెడ్డి
  • వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు: నిరంజన్‌రెడ్డి
  • రాష్ట్రంలో అద్భుత ప్రాజెక్టులు కట్టారు: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • బీడు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి: నిరంజన్‌రెడ్డి
  • రైతుబంధు వంటి పథకాలతో రైతులకు ప్రోత్సాహం అందించారు: నిరంజన్‌
  • సాగు గురించి భాజపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది: నిరంజన్
  • కిషన్‌రెడ్డికి ఎద్దులు లేవు... బండి సంజయ్‌కి బండి లేదు: నిరంజన్
  • కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు: నిరంజన్

11:23 November 18

ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: సీఎం కేసీఆర్

కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్

  • రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం చేపట్టాం: సీఎం కేసీఆర్
  • మహాధర్నాకు తరలివచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం: సీఎం
  • దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: సీఎం కేసీఆర్
  • ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం: సీఎం
  • కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్
  • ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు: సీఎం కేసీఆర్
  • రైతుల ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు: సీఎం
  • ఉత్తరాది రైతులతో కలిసి కేంద్రంపై పోరాడతాం: సీఎం కేసీఆర్
  • పంజాబ్‌ తరహాలోనే రాష్ట్రంలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
  • ఇప్పటివరకు కేంద్రం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది
  • నిన్నే స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశా: సీఎం కేసీఆర్
  • వివిధ పోరాటాల మార్గాన్ని ఎంచుకుని పోరాడతాం: సీఎం కేసీఆర్
Last Updated :Nov 18, 2021, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.