ETV Bharat / city

కల్వకుర్తి ఎత్తిపోతలపై భవిష్యత్​ కార్యాచరణకు టీపీసీసీ సబ్​కమిటీ

author img

By

Published : Oct 22, 2020, 9:15 PM IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం భవిష్యత్​ కార్యాచరణ కోసం సబ్​కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్​ పార్టీ. 11 మంది సభ్యులతో కమిటీని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి.

TPCC SUB COMMITEE
కల్వకుర్తి ఎత్తిపోతలపై భవిష్యత్​ కార్యాచరణకు టీపీసీసీ సబ్​కమిటీ

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై భవిష్యత్‌ కార్యాచరణ కోసం టీపీసీసీ సబ్​కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణానదిపై ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకం పంపుహౌజ్​లో మోటారు పేలిపోవడం, బేస్​మెంట్​ దెబ్బతినడం లాంటి సాంకేతిక లోపాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని టీపీసీసీ తేల్చింది. ఈ విషయంలో ఇప్పటికే పోరాట మార్గం ఎంచుకుని ఈనెల 21న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బంద్ చేపట్టింది. తదుపరి భవిష్యత్‌ కార్యాచరణ కోసం 11 మంది సభ్యులతో కమిటీని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు నాగం జనార్దన్​రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్​రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి సభ్యులుగా ఉన్నారు.

ఇవీచూడండి: కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్​ నేతల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.