ETV Bharat / city

సంజయ్, ఈటల ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదు: రేవంత్‌

author img

By

Published : Sep 8, 2021, 7:23 PM IST

సంజయ్, ఈటల ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. కేసీఆర్, మోదీ మిలాకత్‌కు బండి, ఈటల బలికాక తప్పదన్నారు. దిల్లీలో రాహుల్​గాంధీతో రేవంత్​ రెడ్డితో పాటు ఇతర నేతలు భేటీ అయ్యారు.

revanthreddy
రేవంత్​ రెడ్డి

దిల్లీలో రాహుల్‌గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. రాహుల్​తో సమావేశమైన వారిలో రేవంత్​ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, ఇతర నేతలు ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై రాహుల్​తో చర్చించినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తరచూ పర్యటించాలని రాహుల్‌ను కోరినట్లు వెల్లడించారు. డిసెంబర్ 9 నుంచి సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

వారంరోజుల దిల్లీ పర్యటనలో కేసీఆర్ ఏం సాధించారని? రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలపై ఏమైనా హామీ పొందారా? అంటూ నిలదీశారు. దిల్లీలో అమరవీరుల స్థూపానికి ఎకరం స్థలం కేటాయించాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. మోదీ, కేసీఆర్‌ మధ్య యూపీ ఎన్నికల గురించి చర్చ జరిగిందని.. యూపీలో ఎంఐఎం ఎన్నిచోట్ల పోటీ చేయాలనే అంశంపై వారు చర్చించారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్, మోదీ మిలాకత్‌కు బండి, ఈటల బలికాక తప్పదన్నారు. సంజయ్, ఈటల ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదని చెప్పారు.

సంజయ్, ఈటల ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదు: రేవంత్‌

రాష్ట్రంలో ఉన్న పెద్ద సమస్య కేసీఆర్​ కుటుంబం. కేసీఆర్​ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటుంది. వారిపై పోరాటం చేయడానికి కాంగ్రెస్​, తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. వారం రోజులు దిల్లీ పర్యటన చేసిన కేసీఆర్​ విభజన చట్టంలోని అంశాలపై ఎలాంటి హామీ తీసుకోలేదు.

-రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి: Praja Sangrama yathra: పండుగలకు అనుమతులు తీసుకోవాలా?: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.