ETV Bharat / city

REVANTH: కోకాపేట భూబాగోతం వివరాలు రేపు బయటపెడతా : రేవంత్‌ రెడ్డి

author img

By

Published : Jul 16, 2021, 5:56 PM IST

Updated : Jul 16, 2021, 6:54 PM IST

సీఎం కేసీఆర్​ పాలనకు కాలం చెల్లిపోయిందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. రాబోయేది సోనియమ్మ రాజ్యమని.. పదేళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇంధన, నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారం మోపుతున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాపై రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు రోడ్లమీదకు రావాలని.. కేసీఆర్​ ఫాంహాస్​లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పిద్దామని సూచించారు.

revanth reddy
revanth reddy

ప్రగతి భవన్​ గోడలు బద్దలు కొట్టి.. తెలంగాణ తల్లికి విముక్తి కలిగిద్దాం'

'ఎవ్వరూ అధైర్య పడాల్సిన పనిలేదు.. కార్యకర్తలారా.. ధైర్యంగా ఉండండి.. రోడ్ల మీదకు రండి కొట్లాడుదాం.. ఎవరొస్తారో చూద్దాం.. ఎన్ని వేల మందిని పోలీస్​ స్టేషన్లలో పెడతారో చూద్దాం.. లక్షలాదిగా కదిలొద్దాం.. కేసీఆర్​ ఫాంహౌస్​లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపిద్దాం' అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా.. కాంగ్రెస్​ చేపట్టిన చలో రాజ్​భవన్​ కార్యక్రమంలో ఉద్రిక్తత తలెత్తిన నేపథ్యంలో రేవంత్​రెడ్డిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. అంబర్​పేట్​ ఠాణాకు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు.

పోలీసులు ఇలానే అడ్డుకుంటుంటే.. భవిష్యత్​లో పోలీస్​ స్టేషన్ల ముట్టడి కార్యక్రమం, జైల్​ భరో కార్యక్రమం ఉంటుందని రేవంత్​ హెచ్చరించారు. 'ఎన్ని లక్షల మందిని జైల్లో పెడతారో చూస్తాం.. జైలు, ప్రగతి భవన్​ గోడలు బద్దలు కొట్టి.. కేసీఆర్​ ఫాం హౌస్​లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపిస్తాం' అన్నారు. 70 సార్లు ఇంధన ధరలు పెంచారంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను పెంచితే.. సంపాదించేవారిపైనా అదనపు భారం పడుతుందని.. అదే గ్యాస్​, పెట్రోల్​, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచితే.. సామాన్య, మధ్యతరగతిపై పెనుభారం మోపినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

'ఒక్క సంవత్సరంలో పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరలు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు. ఈ ఏడాది 4 లక్షల 30 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఏడు సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవాళ కేసీఆర్​ అనుకుంటే లీటరు పెట్రోల్​పై రూ.30, మోదీ తలచుకొంటే మరో రూ.30 తగ్గిచ్చొచ్చు. వాస్తవానికి 50 నుంచి 60 రూపాయలకే పెట్రోల్​, డీజిల్​ ఇచ్చే పరిస్థితి ఉంటే.. వీళ్లు ఇవ్వకుండా దొచుకుంటున్నారు.'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇజ్రాయెల్​ సాంకేతికతతో .. రాజకీయ నేతల ఫోన్లు హ్యాకింగ్​ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటుగా హ్యాకర్స్​ పెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్న నేతల ఫోన్లను హ్యాక్​ చేస్తున్నారన్నారు. కోకాపేట భూముల వేలం వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని.. అందులో మొత్తం తెరాస నేతలే ఉన్నారని రేవంత్​ పేర్కొన్నారు. వాటికి సంబంధించిన వివరాలను శనివారం వెల్లడిస్తానని​ తెలిపారు.

'కేసీఆర్​కు కాలం చెల్లిపోయింది. రాబోయేది సోనియమ్మ రాజ్యం. పదేళ్లు అధికారంలో ఉంటాం. మీరు రిటైర్​ అయిపోయినా.. పారిపోయినా.. చర్యలు తీసుకుంటాం. కేసీఆర్​ బంధువులు ఇతర దేశాల్లో పాస్​పోర్టులు తెచ్చుకుంటున్నారు. తొందరలోనే వాటి వివరాలు సైతం బయటపెడతా. మీరు ఏ అవినీతికి పాల్పడకపోతే.. ఇతర దేశాల పాస్​పోర్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది.'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

చలో రాజ్​భవన్​ కార్యక్రమానికి.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎన్ని ఆంక్షలు విధించినా.. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ అన్నారు.

ఇదీచూడండి: Ys Sharmila : 'రాసి పెట్టుకోండి... ప్రభంజనం సృష్టిస్తా..'

Last Updated : Jul 16, 2021, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.