ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM

author img

By

Published : Jun 18, 2022, 2:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS

  • దబీర్‌పేటకు బయల్దేరిన రాకేశ్‌ అంతిమయాత్ర

సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ అంతిమయాత్ర స్వగ్రామం దబీర్​పేటకు చేరువలో ఉంది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమయాత్రలో వేలాదిగా స్థానికులు, వివిధ పార్టీల నేతలు, ఆర్మీ ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

  • తెరాసకు షాక్..

పీజేఆర్ కుమార్తె, తెరాస కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 23న కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

  • సికింద్రాబాద్ 'అగ్నిపథ్‌' అల్లర్ల సూత్రధారి అరెస్ట్!

సికింద్రాబాద్‌ అల్లర్ల ఘటనలో సుబ్బారావు పాత్రపై పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును ఖమ్మంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • 'ఆ విషయంలో తగ్గేదే లే'..

అగ్నిపథ్​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేవీ, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​తో పాటు ఆర్మీ వైస్​చీఫ్​తో భేటీ అయ్యారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ పథకం అమలుపై సమీక్ష చేపట్టిన రాజ్​నాథ్​.. అగ్నిపథ్​ను మరోసారి సమర్థించారు.

  • 'అగ్నిపథ్​' నిరసనలతో ఆగిన ట్రైన్​​​.. వ్యక్తి మృతి..

సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్'​పై నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఘాజీపూర్‌లో దిల్లీకి వెళ్లే ఓ రైలు నిలిచిపోయింది.

  • ప్రియురాలిని సుత్తితో కొట్టి చంపిన బాయ్​ఫ్రెండ్​!

ఝార్ఖండ్​లోని రాంచీలో దారుణం జరిగింది. అక్కాతమ్ముళ్లను దుండగులు సుత్తితో కొట్టి చంపేశారు. కుమార్తె బాయ్​ఫ్రెండే వీరిని చంపేశాడని తల్లి ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • గద్దను పోలి.. పొట్టపై చుక్కలు..

నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన గుడ్లగూబను గుర్తించినట్లు జీవవైవిధ్య విభాగం రేంజ్‌ అధికారి మహ్మద్‌ హయాత్‌ తెలిపారు. నల్లమలలో అరుదైన వన్యప్రాణులు, పక్షులను గుర్తించే క్రమంలో ఈ అరుదైన గుడ్లగూబను గుర్తించి చిత్రీకరించామన్నారు.

  • ఫాస్టెస్ట్​ 150 స్కోరు.. బట్లర్​ జస్ట్​ మిస్​..

వన్డే క్రికెట్‌లో ఎవరైనా సెంచరీలు కొట్టడం సాధారణ విషయమే. అదే 150 పరుగులు చేయడం.. అంత పెద్ద స్కోరును కూడా అతి తక్కువ బంతుల్లోనే సాధించడం గొప్ప విశేషం. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అదేపని చేశాడు.

  • బిట్​కాయిన్​ విలువ ఎంతంటే?

క్రిప్టోకరెన్సీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం బిట్​కాయిన్​ విలువ రూ.17,01,049 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

  • బండ్లగణేశ్ ఆడియో మెసేజ్​ వైరల్​..

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​.. తాజాగా ఓ ఆడియో సందేశాన్ని షేర్​ చేశారు. తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని తప్ప జీవితంలో ఎవర్నీ నమ్మకూడదని చెప్పారు. ప్రస్తుతం ఈ ఆడియో మెసేజ్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.