ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM

author img

By

Published : Aug 28, 2022, 1:50 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY

  • రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గుండు సున్నా..

KTR tweet on Medical Colleges: వైద్య విద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప చరిత్ర లిఖించారని మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్రం ఎన్ని కాలేజీలు మంజూరు చేసిందో సమాధానం చెప్పాలని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

  • ప్రశాంతంగా కానిస్టేబుల్‌ రాతపరీక్ష..

Constable Exam in Telangana రాష్ట్రంలో కానిస్టేబుల్​ రాత పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,601 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్​ నియామక మండలి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిమిషం ఆలస్యం నిబంధనలు అమలులో ఉండటంతో.. పరీక్ష కేంద్రం వద్ద వేకువజాము నుంచే అభ్యర్థులు బారులు తీరారు.

  • ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరద..

Heavy Inflow to Reservoirs రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు అన్నీ నిండుకుండలుగా మారాయి. నాగార్జునసాగర్​ 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తరవాత నెలలో వచ్చే వరద నీరును సైతం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

  • ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి,

Movement of Maoists ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలజడి కలకలం సృష్టిస్తోంది. తిర్యాణి మండలంలో సంచరిస్తున్నట్లు అనుమానం రావడంతో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా అడవులను ప్రత్యేక పోలీసు దళాలు జల్లెడ పడుతున్నాయి. గ్రామస్థులను కలిసి వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా సమాచారం ఇవ్వాలని వారికి పోలీసులు విజ్ఞప్తి చేశారు.

  • పిల్లి అరుపులకు ఓ ప్రాణమే పోయింది..

Murder Case in Banjara Hills హత్యలు జరిగేందుకు భూవివాదమో, ఎన్నో ఏళ్ల కక్షలో ఉండాల్సిన పని లేదు. చిన్న పిల్లిపిల్ల అరుపు కూడా హత్యకు కారణం కావచ్చు. అదేంటీ పిల్లి అరుపు వల్ల హత్య చేయటమేంటీ అనుకుంటున్నారా. అక్షరాలా అదే జరిగింది బంజారాహిల్స్​లో. పిల్లి అరుపులకు చికాకు పడిన ఓ 17 ఏళ్ల బాలుడు 20 ఏళ్ల యువకున్ని కిరోసిన్​ పోసి తగలబెట్టేశాడు. కథ అంతటితో ఆగిపోలేదు. అందులో మరో ట్విస్ట్​ కూడా ఉంది. అదేంటంటే,

  • కళ్లు, నోట్లో ఫెవిక్విక్ పోసి చెరువులో పడేసి..

ఆరేళ్ల చిన్నారి కళ్లతో పాటు నోటిలో ఫెవిక్విక్​ గమ్ పోసి అతికించి దారుణంగా ప్రవర్తించింది ఓ మహిళ. అనంతరం ఆ పిల్లవాడిని చెరువులో పడేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది. మరోవైపు మహారాష్ట్రలోని పుణెలో కుక్కపై పలుమార్లు అసహజ చర్యకు పాల్పడుతున్న ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

  • మూడు టన్నుల సిమెంట్ గంగపాలు

కర్ణాటకలో శుక్రవారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా యాదగిరి జిల్లా షాహపుర మండలం మదరకల్​ గ్రామం వద్ద వంతెనపై నుంచి హిరేహళ్ల నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఈ వంతెనపై వెళ్తున్న ఓ లారీ నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం డ్రైవర్​ను కాపాడారు. ఆ లారీలో మూడు టన్నుల సిమెంట్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  • భారత్ పాక్​ మధ్య మ్యాచుల్లో ఆసక్తికర విషయాలు..

Asia Cup 2022 IND vs PAK ఆసియాకప్​లో భాగంగా మరి కొద్ది గంటల్లో టీమ్​ఇండియా పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా గతంలో ఆసియా కప్​లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లలోని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

  • భారత్​ పాక్​ మ్యాచ్​పై కెప్టెన్​ రోహిత్​ కామెంట్​

Rohithsharma about ind vs pak match openers ఆసియాకప్​లో భాగంగా మరి కొన్ని గంటల్లో పాకిస్థాన్​తో జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడాడు టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ. ఏమన్నాడంటే

  • అలీకి కాబోయే అల్లుడు ఏం చేస్తారో..

Comedian Ali daughter engazement టాలీవుడ్​ కమెడియన్​ అలీ కూతురు నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలీ బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అలీకి కాబోయే అల్లుడు ఎవరు? ఏం చేస్తుంటారు? వంటి విషయాలను ఆరా తీయడంలో బిజీ అయ్యారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఎవరంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.