Telangana News Today : టాప్‌న్యూస్ @ 9AM

author img

By

Published : May 10, 2022, 9:00 AM IST

Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • 'చరిత్రలో నిలిచిపోయేలా 5 లక్షల మందితో సభ'

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించడం తగదన్నారు. రాష్ట్రంలో వచ్చేది భాజపా సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ మహేశ్వరంలో 5 లక్షల మందితో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని వెల్లడించారు.

  • వంటింటి తగాదా.. తల్లి గొంతు కోసిన కుమార్తె

క్షణికావేశంలో కూరగాయలు తరిగే కత్తితో కన్నతల్లి గొంతు కోసింది ఓ కుమార్తె. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్​నగర్​ జనరల్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

  • తాగేందుకు డబ్బివ్వలేదని పెట్రోల్‌ పోసి భార్యకు నిప్పు

భార్య సంపాదనపై ఆధారపడి బతికే ఓ భర్త తాగుడుకు బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బు కావాలని తరచూ ఆమెతో గొడవపడుతుండే వాడు. అలా సోమవారం కూడా భార్యతో మద్యానికి డబ్బులు కావాలని వాగ్వాదానికి దిగాడు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది.

  • 'షవర్మా' బ్యాన్​

యువత ఎంతో ఇష్టంగా తినే షవర్మాను తమ మున్సిపాలిటీ పరిధిలో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు వెల్లూర్ జిల్లా గుడియాథం మేయర్. షవర్మా ఆరోగ్యానికి హాని చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

  • శుభలేఖలు ఇస్తుండగా యువతిపై గ్యాంగ్​రేప్

తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ యువతి ఆరోపించింది. తర్వాత నిందితులు తనను ఓ రాజకీయ పార్టీ నేత దగ్గరకు తీసుకెళ్లారని, మరో వ్యక్తితో కొన్ని రోజులు ఉండేలా బలవంతం చేశారని ఫిర్యాదు చేసింది. యూపీ ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • ఏసీ, ఫ్రిజ్​, ఇంటర్​నెట్​.. తెగ వాడేస్తున్న భారతీయులు!

భారతదేశంలో విలాసవంతమైన వస్తువుల వినియోగం గత అయిదేళ్లలో బాగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం ఎక్కువగా పెరగకపోయినా ఇంటర్నెట్​ మాత్రం భారీ పెరిగింది. ఏసీ, ఫ్రిజ్​, వాషింగ్​ మిషన్ల వాడకంలో పెరుగదల కనిపించింది. ప్రస్తుతం ప్రతి ఒకరి చేతిలో మొబైల్‌ ఉండటం వల్ల గడియారం వాడకం బాగా తగ్గింది.

  • 'పటేల్'​ రాకతో ఆంగ్లేయులకు చుక్కలే!

అప్పగించిన పనిని చాకచక్యంగా పూర్తి చేస్తూ.. గాంధీజీకి నమ్మినబంటుగా ఎదిగిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు నాగ్‌పుర్‌లో జెండా సత్యాగ్రహం రూపంలో పరీక్ష ఎదురైంది. చివరకు కాంగ్రెస్‌ కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేయకుంటే తన రాజీనామా తప్పదంటూ బ్రిటిష్‌ గవర్నరే స్వయంగా లండన్‌ను బెదిరించే అనూహ్య పరిస్థితి సృష్టించి, సత్యాగ్రహాన్ని విజయవంతం చేశారు సర్దార్‌ పటేల్‌!

  • వృద్ధుల్లో కొవిడ్ తీవ్రరూపం కారణమిదే

వృద్ధుల్లో కరోనా మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపడానికి కారణం జన్యుపరమైన అంశాలేనని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. వయసు పెరిగే కొద్ది రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతున్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించారు.

  • ఆగయా నయా నాదల్‌

చిన్నతనంలో ఆ పిల్లాడు చూసిన తొలి టెన్నిస్‌ టోర్నీ అది.. అప్పుడు దిగ్గజం నాదల్‌ టైటిల్‌ గెలిచాడు.. అది చూసి తన ఆరాధ్య ఆటగాడి లాగే ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆ పిల్లాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆ లక్ష్యాన్ని సాధించాడు. అది కూడా నాదల్‌, జకోవిచ్‌లపై నెగ్గి విజేతగా నిలిచాడు. ఆ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌.. ఇప్పుడు కుర్రాడిగా మారిన ఆ పిల్లాడి పేరు కార్లోస్‌ అల్కరస్‌. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో ఈ టీనేజర్‌ ఇప్పుడు నయా సంచలనం. అగ్రశ్రేణి ఆటగాళ్లకు షాక్‌లిస్తూ.. వరుస విజయాలతో భవిష్యత్‌ తారగా వెలిగే దిశగా ఈ స్పెయిన్‌ కుర్రాడు సాగుతున్నాడు. అతడి గురించే ఈ కథనం..

  • బాలయ్య 'అన్​స్టాపబుల్'​ క్రేజ్​.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

'అన్‌ స్టాపబుల్‌ విత్​ ఎన్​బీకే' ఓ ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన రెండు సిల్వర్​ ట్రోఫీలను సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.