ETV Bharat / city

Top News: టాప్ న్యూస్ @ 9PM

author img

By

Published : May 24, 2022, 8:59 PM IST

TOP NEWS in Ts
టాప్ న్యూస్ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • అదే అసలైన సవాల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వాటి ఉపయోగాలతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని తెలిపారు. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక చర్చాగోష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్- మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు.

  • రేవంత్​ వ్యాఖ్యల దుమారం

రెడ్డి, వెలమ సామాజికవర్గాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండిస్తున్నారు. రేవంత్​ మాట్లాడింది.. ఆయన వ్యక్తిగతమని తేల్చిచెబుతున్నారు.

  • మోదీ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 'కేసీఆర్​ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయా..?

Bandi Sanjay Comments: రేపు కరీంనగర్​లో నిర్వహించబోయే హిందూ ఏకతా యాత్ర ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించారు. రెండేళ్ల తర్వాత యాత్ర నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లాలోని హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పంజాబ్​ రైతులు సీఎం కేసీఆర్​ చెక్కులు ఇవ్వటంపై స్పందించిన బండి సంజయ్​.. వ్యంగ్యారోపణలు చేశారు.

  • 'పంజాబ్ రైతులపై ఎందుకంత ప్రేమ...'

Jaggareddy Comments On KCR: తెలంగాణ రైతుల మీద లేని ప్రేమ కేసీఆర్​కు పంజాబ్ రైతుల మీద ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెరాస, భాజపా, ఎంఐఎం మధ్య రాజకీయ సంబంధం కుదిరిందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లయినా రాష్ట్రంలో రూ. లక్ష రుణ మాఫీ చేయలేదని మండిపడ్డారు.

  • 'భారత్​-అమెరికా బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక'

Modi japan visit: టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు మోదీ. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి మీద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు బైడెన్.

  • ఆ రెండు దేశాలకు క్వాడ్ హెచ్చరిక..!

QUAD warns Pakistan: పాకిస్థాన్, చైనాకు క్వాడ్ దేశాధినేతలు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదం విషయంలో పాక్​కు పరోక్షంగా బుద్ధి చెప్పిన క్వాడ్ నేతలు.. ఇండో పసిఫిక్​లో చైనా దుందుడుకు వైఖరిని ఎండగట్టారు. కాగా, జపాన్ పర్యటనలో భాగంగా.. ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ అయ్యారు. జపాన్ మాజీ ప్రధానులను సైతం కలిశారు.

  • కాంగ్రెస్​ కోసం 'టాస్క్​ఫోర్స్​'..

Congress news: 2024 ఎన్నికల ముందు దేశంలో మళ్లీ పట్టుసాధించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్​.. అందుకు అవసరమైన కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. జీ-23 నేతలు సహా కాంగ్రెస్​ సీనియర్ నేతలు వీటిలో సభ్యులుగా ఉన్నారు.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర..

Gold Rate: మంగళవారం బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి రూ.52వేల 790 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.62,950 కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీ విలువ స్వల్పంగా తగ్గింది.

  • మూడు నెలల్లో మూడు సినిమాలు

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో హీరో కార్తి నటించిన మూడు కొత్త చిత్రాల రిలీజ్​ డేట్స్​ ఉన్నాయి. అవన్నీ వరుసగా మూడు నెలల వ్యవధిలో విడుదల కానున్నాయి. ఇక హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి రానున్న మరో చిత్రం 'థోర్‌: లవ్‌ అండ్ థండర్‌'కు సంబంధించిన ట్రైలర్​ విడుదలైంది. ఇది ఆసక్తికరంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.