ETV Bharat / city

NTR VIDEO CALL TO FAN: ప్రాణాపాయస్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ వీడియోకాల్​ ​

author img

By

Published : Oct 7, 2021, 12:07 PM IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని కోరిక నెరవేర్చారు కథానాయకుడు జూనియర్​ ఎన్టీఆర్​. స్వయంగా వీడియో కాల్​ చేసి.. ధైర్యం చెప్పారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తారని ఆకాంక్షించారు.

ntr video cal to his fan
ntr video cal to his fan

ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమానికి వీడియో కాల్​ చేసి పరామర్శించారు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ.. జూనియర్​ ఎన్టీఆర్​కు వీరాభిమాని. ఇటీవల ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడం వల్ల విజయవాడలోని రమేశ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి.. తన చివరి కోరికగా.. జూనియర్​ ఎన్టీఆర్​ను కలవాలని వైద్యులకు చీటి రాసి చూపించాడు. ఆ విషయాన్ని వైద్యులు.. మురళీ బంధువులకు చెప్పారు. వెంటనే వారు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్​ అభిమాన సంఘానికి... మురళీ చివరి కోరికను తెలియజేశారు.

ధైర్యం చెప్పిన ఎన్టీఆర్​..

తన అభిమాన సంఘం సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జూనియర్​ ఎన్టీఆర్​.. వెంటనే మురళీకి వీడియో కాల్​ చేశారు. తనను ఎంతగానే ప్రేమిస్తున్న తన అభిమానికి ఇలా జరగడం తనను కలచివేసిందని చెప్పారు. వీడియో కాల్​లో మురళీతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మురళీ బయటకు వస్తాడని ​ ఆకాంక్షించారు. తన అభిమాన కథానాయకుడు వీడియో కాల్​ చేయడంతో మురళీ ఉప్పొంగి పోయాడు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానంటూ సైగలతో ఎన్టీఆర్​కు వివరించారు.

మురళీ కోసం వీడియో కాల్​ చేసి ధైర్యం చెప్పిన జూనియర్​ ఎన్టీఆర్​కు.. ఆయన బంధువులు ధన్యవాదాలు తెలిపారు. యంగ్​ టైగర్​పై ప్రశంసలు కురిపించారు.

ఇదీచూడండి: MAA Elections: వారికి మద్దతిస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అన్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.