ETV Bharat / city

Top News Today : టాప్​న్యూస్​@ 9AM

author img

By

Published : Jan 6, 2022, 8:58 AM IST

top news
top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • కబళించిన గ్యాస్‌

గుజరాత్ సూరత్​లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కంపెనీలో కెమికల్ ట్యాంకర్​ నుంచి విషవాయువు లీకై ఆరుగురు మరణించారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

  • తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపన

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సొంపేట సమీపంలో మంగళవారం రాత్రి భూమి కంపించగా.. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా దామస్తాపూర్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి.

  • థర్డ్​వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం!

కరోనా మూడో దశ కమ్ముకొస్తున్న నేపథ్యంలో రాజధానిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. వారం రోజులుగా నిత్యం వెయ్యి వరకు కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

  • ఖమ్మం జిల్లాలో చైనా ట్యాగ్​తో పావురం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో బుధవారం కాలుకు చైనా భాష ట్యాగ్‌ ఉన్న పావురం కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది.

  • ఈ ఏడాది 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ

2022లో రాజ్యసభ సభ్యులు మొత్తం 77 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది రాజ్యసభ సచివాలయం. ఇందులో ఆంధ్రప్రదేశ్​ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, పీయూష్​ గోయల్​ వంటి ప్రముఖుల పదవీ కాలం సైతం ఈఏడాదే ముగియనుంది.

  • 'వారికి కరోనా డ్యూటీ 8 గంటలకు మించొద్దు'

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వేకంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యుల రక్షణపై కీలక సూచనలు చేసింది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్(ఐఎంఏ). రెసిడెంట్​ డాక్టర్లకు కొవిడ్​ డ్యూటీ 8 గంటలకు మించకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

  • ఈమె జీతం రూ.కోటిపైనే

బహుముఖప్రజ్ఞాశాలి.. ఇది సంప్రీతి యాదవ్‌కు సరిగ్గా సరిపోతుంది. చదువు, ఆటలు, సంగీతం.. అన్నింట్లోనూ ముందే. అంతేనా.. ప్రాంగణ నియామకాల్లో నాలుగు పెద్ద సంస్థల్ని మెప్పించింది. తాజాగా గూగుల్‌లో రూ.కోటీ పది లక్షల వేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించింది. ఈమె గురించి ఇంకా తెలుసుకోవాలా? ఇది చదివేయండి.

  • మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా మరో క్షిపణిని పరీక్షించింది. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది తొలిసారి గుర్తించారు. ఇది దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • జకోవిచ్​కు ఘోర అవమానం

సెర్బియా​ టెన్నిస్‌ స్టార్​ నొవాక్‌ జకోవిచ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడి వీసాను రద్దు చేశారు. కరోనా వ్యాక్సిన్​కు​ సంబంధించిన తగిన వివరాలను జకోవిచ్​ సమర్పించకపోవడమే కారణమని ఆస్ట్రేలియా బోర్డర్​ ఫోర్స్​ అధికారులు వెల్లడించారు.

  • రవితేజకు విలన్​గా హాట్​బ్యూటీ

రవితేజ కొత్త సినిమాలో విలన్​గా హాట్​బ్యూటీని ఎంపిక చేయాలని చిత్రబృందం చూస్తోంది. దాదాపు ఖరారైపోయినట్లేనని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.