ETV Bharat / city

V. C. Sajjanar News : 'డిపోలు మూసేది లేదు.. భూములు అమ్మేది లేదు'

author img

By

Published : Nov 30, 2021, 12:53 PM IST

V. C. Sajjanar News, సజ్జనార్ న్యూస్, ఆర్టీసీ బ్లడ్ క్యాంప్, RTC blood camp, sajjanar news
V. C. Sajjanar News

V. C. Sajjanar News : అత్యవసర సమయాల్లో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లను కాపాడటం కోసమే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా.. 97 డిపోలు 67 సొసైటీల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ డిపోలు మూసేసి.. భూములు అమ్మేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు.

V. C. Sajjanar News : అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్ధేశంతోనే రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ వెల్లడించారు. జేబీఎస్​లో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి రక్తదాన శిబిరాన్ని బాజిరెడ్డి ప్రారంభించారు. 50 మంది ఉద్యోగులు రక్తదానం చేయగా.. దాతలకు ధ్రువపత్రాలు అందజేశారు.

TSRTC blood camp : రెడ్‌క్రాస్‌ సొసైటీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. రక్తదాతలకు ఇవాళ బస్సుల్లో ఉచితంగా తిరుగు ప్రయాణ సౌకర్యం కల్పించారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలను ఆర్టీసీ నిర్వహిస్తోంది.

TSRTC News : మహాత్మా గాంధీ బస్​ స్టేషన్​లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీఎస్​ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్​ను ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. ఎంజీబీఎస్​లోని స్టాళ్లలో ధరపై సజ్జనార్ ఆరా తీశారు. తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. మూడుసార్ల కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన స్టాళ్లను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు.

Collector Sharman : రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ అన్నారు. ప్రతి ఒక్కరు రక్తం దానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

"బస్సు డిపోలను మూసేస్తున్నారు. భూములు అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదు. ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయి. భూములు అమ్మాలనే ఆలోచన లేదు. వచ్చే శనివారం నుంచి జోగులాంబకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు నడుస్తుంది. టీఎస్​ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 97 డిపోలు 67 సొసైటీల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. గతేడాది నుంచి రక్తం నిధుల కొరత ఏర్పడుతోంది. తలసేమియా, క్యాన్సర్, ప్రమాదాలకు గురైన బాధితులకు రక్తం ఎంతో అవసరం. వారి కోసమే టీఎస్​ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించాం."

- సజ్జనార్, టీఎస్​ఆర్టీసీ ఎండీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.