గుడ్​ గవర్నెన్స్​లో రెండు అవార్డులు.. కేసీఆర్​ పాలనాదక్షతకు తార్కాణం.: కేటీఆర్​

author img

By

Published : Dec 26, 2021, 5:04 PM IST

Updated : Dec 26, 2021, 5:23 PM IST

telangana good governance, ktr
తెలంగాణ గుడ్ గవర్నెన్స్​, కేటీఆర్​ ()

Good governance awards for Telangana: సీఎం కేసీఆర్​ సుపరిపాలనతోనే గుడ్​ గవర్నెన్స్​లో రాష్ట్రానికి రెండు అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్​ అన్నారు. పారిశ్రామికీకరణ- వాణిజ్యం, సోషల్​ వెల్ఫేర్​ అండ్​ డెవలప్​మెంట్​ విభాగాల్లో తెలంగాణ రెండు అవార్డులు దక్కించుకోవడం పట్ల కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖను కేటీఆర్​ అభినందిస్తూ ట్వీట్​ చేశారు.

Good governance awards for Telangana: కేంద్రం విడుదల చేసిన గుడ్ గవర్నన్స్ సూచీల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు అవార్డులను దక్కించుకోవటం పట్ల మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్​లో తెలంగాణ.. పారిశ్రామికీకరణ- వాణిజ్యం, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్​మెంట్ సెక్టార్లలో అవార్డులు దక్కించుకుంది. ఈ అవార్డులే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనదక్షతకు తార్కాణం అని కేటీఆర్ అన్నారు.

అవార్డు దక్కేలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖను మంత్రి కేటీఆర్ అభినందించారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర పారిశ్రామికీకరణకు పాటుపడిన పరిశ్రమ లీడర్లకు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్​కు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అందుకే ర్యాంకులు

good governance ranks: ఆయా ప్రభుత్వ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. 2020-21 సంవత్సరానికి కేంద్రం వెలువరించిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్​లో రాష్ట్ర ప్రభుత్వం రెండు అవార్డులతో మెరిసింది. పారిశ్రామికీకరణ, వాణిజ్యం, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్​మెంట్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు ఇక్కడి పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్ ఎన్విరాన్​మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో మెరుగైన స్థానం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరు అంశాల ఆధారంగా ఈ ర్యాంకును తెలంగాణ కైవసం చేసుకుంది. ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ రేటు, హౌసింగ్ ఫర్ ఆల్, లింగ సమానత్వం, ఎకానమిక్ ఎంపవర్​మెంట్ ఆఫ్ వుమెన్ సూచీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కేటగిరీలో తెలంగాణ ప్రభుత్వానికి మొదటిస్థానంలో నిలిచింది.

మొత్తం పది రంగాల్లో

రాష్ట్ర ప్రభుత్వాల పాలనలోని పది రంగాలకు గానూ 58 సూచీలతో అంచనా వేసి ఈ ర్యాంకులను కేటాయిస్తోంది. ఈ ఏడాదిలో గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీలో ప్రకటించారు. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది.

ఇదీ చదవండి: GCC GIRI brand soaps : మూడు సబ్బులు... ఆరు డబ్బులుగా సాగుతున్న 'గిరి' సబ్బుల పరిశ్రమ

Last Updated :Dec 26, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.