ETV Bharat / city

Telangana Top News: టాప్​ టెన్​ న్యూస్​ @1PM

author img

By

Published : Apr 6, 2022, 1:00 PM IST

టాప్​ టెన్​ న్యూస్​ @1PM
టాప్​ టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • మోదీతో గవర్నర్‌ తమిళిసై..

రాష్ట్రంలో గిరిజనుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని.. గవర్నర్‌ తమిళిసై తెలిపారు. ప్రధానితో సమావేశమైన గవర్నర్‌ పుదుచ్చేరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను వివరించానని తెలిపారు. తెలంగాణలో 11 శాతం గిరిజన జనాభా ఉందని.. వాళ్ల సమస్యలపై తాను దృష్టిపెట్టిన విషయాన్ని ప్రధానికి తెలిపానన్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటనలతో సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని మోదీకి వివరించానని.. తమిళిసై వెల్లడించారు.

  • కేటీఆర్ ట్వీట్.. డీజీపీ యాక్షన్..

హైదరాబాద్‌లో బోలక్‌పూర్ పోలీసులపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.

  • 'ఆ పార్టీలకు మాత్రమే'..

సిద్ధాంతాల పునాదిపై.. ప్రజల శ్రేయస్సు కోరి పనిచేసే పార్టీలకే దేశంలో మనుగడ ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్ఘాటించారు. కాషాయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెరాస కేంద్ర సర్కార్‌ను బద్నాం చేస్తోందని మండిపడ్డారు.

  • అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​..

మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్​చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్​రెడ్డి వెల్లడించారు. 4 కిలోల 130 గ్రాముల గంజాయి, రూ.1.85 లక్షల నగదు, కార్లు,చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • పెరిగిన మానవుల ఆయుష్షు..

గడచిన 50 ఏళ్లలో పోల్చుకుంటే దేశంలో మానవుల సగటు జీవితకాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉండగా.. 2020 నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విషయంలో విశేష పురోగతి కనిపిస్తోంది.

  • 'వారివి కుటుంబ రాజకీయాలు'..

భాజపా 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గత పాలకులపై విమర్శలు చేశారు.

  • గర్భిణీని మూడంతస్తుల పైనుంచి తోసేసి..

ఉత్తరాఖండ్​లో ఘోరం జరిగింది. రెండు కుటుంబాల మధ్య వివాదం ఓ గర్భిణీ ప్రాణాలమీదకు వచ్చింది. గొడవ పడుతూ ఓ మహిళను మూడంతస్తుల పైనుంచి తోసేశారు మరో కుటుంబానికి చెందిన వ్యక్తులు.

  • తగ్గిన బంగారం ధర..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం సుమారు రూ.140 దిగొచ్చింది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి దాదాపు రూ.670 మేర పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • ఆరెంజ్​​, పర్పుల్​ క్యాప్​ ఎవరిదగ్గర?

ఐపీఎల్​ 2022 ఉత్కంఠభరితంగా సాగుతోంది. మంగళవారం వరకు 13 మ్యాచ్​లు ముగిశాయి. మరి ఇప్పటివరకు ఏ జట్టు పాయింట్ల పట్టికలో టాప్​లో ఉంది. ఏ జట్టు ఆఖర్లో ఉంది. ఇప్పటివరకు ఎవరు అత్యధిక పరుగులు చేశారు. ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు?

  • అనన్య పాండే ఝలక్​..

బాలీవుడ్​ హీరోయిన్​ అనన్య పాండే.. హీరో ఇషాన్​ కట్టర్​తో విడిపోయినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ జంట స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.