ETV Bharat / city

Telangana top news: 3PM టాప్​న్యూస్

author img

By

Published : Aug 31, 2022, 3:05 PM IST

TELANGANA TOP NEWS
TELANGANA TOP NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

  • గల్వాన్‌ అమరుల కుటుంబాలకుసీఎం ఆర్ధికసాయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిహార్‌ రాజధాని పట్నా చేరుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. గల్వాన్‌ అమరుల కుటుంబాలకు ఆర్ధికసాయం అందించే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

  • ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశుడు..

రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌ గణేశ్‌ వద్ద కోలాహలం నెలకొంది. బడా గణేశుడికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ నిర్వహించారు.

  • దారి తప్పుతున్న మైనర్లు..

బుద్ధిగా చదువుకోవాల్సిన కొందరు పిల్లలు దారి తప్పుతున్నారు. ఆకతాయిలుగా పోలీసు రికార్డులకు ఎక్కుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యువతుల్ని వేధిస్తున్న వారిలో మైనర్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. హైదరాబాద్​లో షీ టీమ్స్​కు చిక్కుతున్న వారిలో 35 నుంచి 40 శాతం వరకు 18 ఏళ్ల లోపు విద్యార్థులే ఉన్నారు.

  • ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో తెలంగాణ నంబర్ వన్

సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనప్పటికీ, సమర్థంగా పనిచేయడం వల్లే బాధితులకు తగిన న్యాయం జరుగుతోందని డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

  • కష్టపడి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్, నర్స్ ఆబ్సెంట్

మధ్యప్రదేశ్​లోని దామోహ్​ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. అంబులెన్స్​ గ్రామంలోకి రాకపోవడం వల్ల గర్భిణీని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఓ భర్త. అంత కష్టపడి వెళ్లాక ప్రసవం చేసే డాక్టర్, నర్స్​ విధులకు గైర్హాజరు కావడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించాడు. రానేహ్​ ప్రాంతానికి చెందిన కైలాస్​ భార్య కాజల్ నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం పురిటి నొప్పులు రావడం వల్ల కైలాస్​​​.. అంబులెన్స్​కు కాల్​ చేశాడు

  • ఫైనల్‌కు చేరిన బ్రిటన్‌ ప్రధాని రేసు..

దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్​ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలబెట్టేందుకు రాత్రి, పగలు పనిచేస్తానని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం తాను పార్టీ విలువలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు.

  • ఇకపై దిల్లీ, కోల్​కతా నుంచి హైదరాబాద్​కు ఫుడ్ డెలివరీ..

ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సర్వీసుల్ని పరిచయం చేసింది. వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన ఆహారాన్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్​ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

  • కిదాంబి శ్రీకాంత్​ శుభారంభం..

జపాన్​ ఓపెన్​ సూపర్​ 750 టోర్నమెంట్​లో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో భారత స్టార్ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేయగా, లక్ష్యసేన్​కు నిరాశ ఎదురైంది.

  • స్టేజ్​పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన కమెడియన్​

ఓ వైపు సినిమాలు చేస్తూనే, జబర్దస్త్​ ద్వారా ఫుల్​ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్​ ధనరాజ్.. ఓ ఈవెంట్​లో స్టేజ్​పైనే వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఏం జరిగిందంటే.

  • రెస్టారెంట్​లో అలా చేసిన బాలయ్య

'ఎన్​బీకే 107' కోసం టర్కీ వెళ్లిన నందమూరి బాలకృష్ణ అక్కడ ఓ రెస్టారెంట్​కు వెళ్లారు. అయితే ఆ రెస్టారెంట్​లో ఆయన చేసిన ఓ పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ బాలయ్య ఏం చేశారంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.