ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @1PM

author img

By

Published : Apr 19, 2022, 12:59 PM IST

top news
top news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • పాతబస్తీకి కొత్త నగిషీలు..

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే ఈ మహానగరానికి ఎన్నో సరికొత్త హంగులు రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్ నగరాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు ఎన్నో అభివృద్ధి పనులకు స్వయంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నాంది పలుకుతున్నారు.

  • బీజాపూర్​లో మావోయిస్టుల బీభత్సం..

ఛత్తీస్​గఢ్ భీజాపూర్​లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. శివశక్తి కంపెనీకి చెందిన 9 వాహనాలను తగులబెట్టారు. ఇందులో 7 టిప్పర్లు, 2 జేసీబీలు పూర్తిగా కాలిపోయాయి.

  • పాత సైకిల్​తో నయా మోటార్​ బైక్

రఘువరణ్ బీటెక్ సినిమా చూశారు కదా. అందులో హీరో వద్ద ఓ బైక్ ఉంటుంది. అది పెట్రోల్ లేకుండా కూడా నడుస్తుంది. ఇటు సైకిల్​గా... అటు బైక్​గా రెండు రకాలుగా పనిచేస్తుంది. అచ్చం అలాంటి బైక్​నే తయారు చేశాడు హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు.

  • రైతే రా'రాజు'

పదో తరగతి చదివిన ఆ రైతు.. సాగులో మాత్రం చాలా పెద్ద పండితుడు. వినూత్న పద్ధతులు.. ఆధునిక సాంగేతికత వినియోగంతో సాగులో లాభాల బాట పడుతున్నాడు. 500 రకాల దేశవాళీ వరి వంగడాలను సంరక్షిస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు.

  • నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

క్రిప్టో కరెన్సీ వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఉగ్రవాద నిధులకు ఉపయోగించే ముప్ప పొంచి ఉందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఓ సెమినార్​లో మాట్లాడారు.

  • పురుషులు కూర్చోవద్దు..

ఆర్​ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో జిల్లాలో కీలక ఆదేశాలు జారీ చేశారు కేరళలోని పాలక్కడ్​ ఎడిషనల్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్. జిల్లాలో ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు.

  • అక్కడ లీటర్ పెట్రోల్ రూ.338

సంక్షోభంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు ఇంధన ధరలు గుదిబండలా మారాయి. లంక చమురు సంస్థ మరో రూ.84 పెంచడం వల్ల ఆ దేశంలో లీటర్​ పెట్రోల్ ధర ఏకంగా రూ.338కి చేరింది. మరోవైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాని మహింద రాజపక్స ప్రతిపాదించారు.

  • జుట్టును పెంచే గింజలు...

జుట్టుకు పైపైన ఎన్ని లేపనాలు పూసినా.. ఫలితం తక్కువే. పోషక విలువలున్న ఆహారానికి కొన్నిరకాల గింజలు జత చేసి తీసుకుంటేనే శిరోజాలు పెరుగుతాయంటున్నారు నిపుణులు...

  • మాల్దీవుల్లో రాఖీభాయ్​..

'కేజీఎఫ్ 2' విజయోత్సాహంలో కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారగా.. దీన్ని చూసిన అభిమానులు లైక్స్​, కామెంట్స్​తో సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు.

  • ఫించ్​తో​ మాటల యుద్ధం

ఐపీఎల్​లో కోల్​కతా ఓపెనర్​ ఆరోన్​ ఫించ్​తో మాటల యుద్ధానికి దిగాడు రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. దీంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.