ETV Bharat / city

Traffic challan : 'పెండింగ్​ చలానాలున్నా వాహనం జప్తు చేయొద్దు'

author img

By

Published : Aug 21, 2021, 8:27 PM IST

Updated : Aug 21, 2021, 8:33 PM IST

పెండింగ్​ చలానాలున్న కారణంగా తన వాహనాన్ని జప్తు చేశారంటూ ఓ న్యాయవాది దాఖలుచేసిన రిట్​ పిటిషన్​పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది.

high court on vehicle seiz
high court on vehicle seiz

పెండింగ్​ చలానాలు కారణంగా రోడ్డెక్కెందుకు భయపడుతున్న వాహనదారులకు హైకోర్టు మార్గదర్శకాలు కాస్త ఊరటనిచ్చాయి. చట్టప్రకారం వాహనం సీజ్​ చెయొద్దంటూ హైకోర్టు సూచనలిచ్చింది.

కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ తొగరి.. ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా పర్వత్‌నగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని ఎస్సై మహేంద్రనాథ్‌ కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఒక్క చలానాకే సీజ్‌ చేస్తారా అంటూ న్యాయవాది నిలదీశారు. నిబంధనల ప్రకారమే చేశామని పోలీసులు తెలిపారు.

చలానా ఎక్కడ వేశారు..? ఎందుకు వేశారు? అంటూ సదరు న్యాయవాది పోలీసులను ప్రశ్నించారు. ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్‌, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా రూ.1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్‌ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సిందని.. ఇంత ఎలా రాశారు? ఒక్క ఉల్లంఘనకు మూడు శిక్షలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.

ఆగస్టు 11న ఈ రిట్​ పిటిషన్​ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని స్పష్టం చేసింది. వాహనం తిరిగివ్వాలని ఆదేశాలు జారీచేయడం వల్ల ఆ వాహనాన్ని తిరిగిచ్చేశారు.

మయాంక్‌ జోషి భార్యా పిల్లలతో కలిసి అద్దె కారులో శామీర్‌పేట్‌ నుంచి మణికొండ వైపు వెళ్తున్నారు. అతన్ని అడ్డగించిన పోలీసులు.. కారుపై రూ.19,695 పెండింగ్‌ చలానాలున్నాయని చెప్పారు. 45 నిమిషాలైనా వదల్లేదని బాధితుడు తెలిపారు. స్పందించాలంటూ విషయాన్ని జూమ్‌కార్‌, ట్రాఫిక్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా తెలిపగా.. అనంతరం విడిచిపెట్టారని ఆయన తెలిపారు.

ఇదీచూడండి: Bullet Bandi song : బుల్లెట్​ బండి పాటకు నర్సు స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!

Last Updated :Aug 21, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.