ETV Bharat / city

సర్కార్ వైద్యం బలోపేతానికి ఐదంచెల వైద్య వ్యవస్థ

author img

By

Published : Apr 27, 2022, 7:56 AM IST

Government Hospitals in Telangana
Government Hospitals in Telangana

Government Hospitals in Telangana : రాష్ట్రంలో పేదలకు మెరుగైన సర్కార్ వైద్యం అందించేలా వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మూడంచెల వ్యవస్థతో సేవలందిస్తుండగా.. తాజాగా ఐదంచెల వైద్య వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్యం ప్రగతి పథంలో దూసుకెళ్లి.. నిరుపేదలకు అండగా మెరుగైన వైద్యం అందించే దిశగా కార్యచరణ రూపొందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Telangana Health Ministry : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఐదంచెల వైద్య వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మూడంచెల వ్యవస్థ కొనసాగుతుండగా.. దీనికి అదనంగా కొత్తగా మరో రెండంచెలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. సర్కారు వైద్య వ్యవస్థ అభివృద్ధి దిశగా ఇప్పటికే ప్రయాణం ప్రారంభమైందనీ, రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యం మరింత బలోపేతం కానుందని స్పష్టం చేసింది.

Health Department Report on Medical Progress : వ్యాధులను తొలిదశలో గుర్తించడం ద్వారా జబ్బు ముదిరిన తర్వాత చికిత్స అందించే పరిస్థితులను తప్పించవచ్చనీ.. అందుకే నివారణ దిశగా దృష్టిసారించిన ప్రభుత్వం పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల పేరిట కొత్త వైద్యవ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆరోగ్య శాఖ వివరించింది. ఇదే సమయంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవల కోసం కూడా ‘టిమ్స్‌’ రూపంలో ఐదో అంచెను కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ ఏర్పడ్డాకా వైద్య వ్యవస్థ ప్రగతి దిశగా పరుగులు పెడుతున్న తీరుపై ఆరోగ్యశాఖ మంగళవారం నివేదిక విడుదల చేసింది.

పల్లెల్లోనే వైద్యుడు : ప్రస్తుతం 1. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం 2. ద్వితీయ స్థాయి సేవలను అందించేందుకు జిల్లా ఆసుపత్రులు 3.స్పెషాలిటీ వైద్యాన్ని అందించేందుకు బోధనాసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా వ్యాధుల నివారణ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యాలను అందించేందుకు అదనపు వైద్య వ్యవస్థలను ప్రభుత్వం నెలకొల్పింది. తద్వారా 5000 జనాభా ఉన్న పల్లెల్లోనూ, బస్తీల్లోనూ వైద్యుడు అందుబాటులో ఉంటారు.

  • దేశవ్యాప్తంగా యూజీ, పీజీ వైద్య సీట్ల కొరత, ప్రత్యేకంగా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం వైద్యవిద్య విస్తరణకు అధిక ప్రాధాన్యమిస్తోంది.
  • తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా.. రాష్ట్ర అవతరణ అనంతరం కొత్తగా 4 వైద్య కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటికి అదనంగా 2021లో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు, 2022-23లో 8, 2023-24లో మరో 8 కళాశాలలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది.
  • 2014లో రాష్ట్రంలో 700 యూజీ వైద్య సీట్లు అందుబాటులో ఉండగా.. 2021లో 1,640కి పెరిగింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.