ETV Bharat / city

కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్​

author img

By

Published : Oct 11, 2020, 7:52 PM IST

కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చూస్తుంటే తమ గుండె బరువెక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెరాస ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని సూచించారు. ప్రతి దళితుడు దుబ్బాక వెళ్లి కాంగ్రెస్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

dalitha sankalpam meeting held in gandhi bhavan
కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్​

దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఐక్యంగా బుద్ది చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు చూస్తుంటే తమ గుండె బరువెక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకోలేమా అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్​ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్​

ప్రజాస్వామ్య పద్ధతిలో కేసీఆర్‌కు బుద్ది చెప్పాలంటే దుబ్బాకలో తెరాసను ఓడించాలన్నారు. ఇందుకు ప్రతి దళితుడు దుబ్బాక వెళ్లి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.

పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రీతం అధ్యక్షతన గాంధీభవన్‌లో 'సంకల్పం' పేరుతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లురవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్‌ యాదవ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం తెలంగాణ ఇంఛార్జి రవీంద్ర పాల్గొన్నారు.

మంత్రి పదవులు ఇస్తానని మోసం చేసి.. ఇప్పుడు ఉన్న భూములు గుంజుకుంటున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దళితులకు ఇచ్చిన భూములను.. తెరాస ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో లాక్కుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దళితులంతా ఒక్కటై ఉద్యమించకపోతే బతుకు లేకుండా పోతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తాం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.