ETV Bharat / city

త్వరలో రాజ్​భవన్​లో ప్రజాదర్బార్..!

author img

By

Published : Sep 17, 2019, 7:07 PM IST

రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజభవన్​లో ప్రజాదర్బార్ నిర్వహించే ప్రతిపాదన తన పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు.

త్వరలో రాజ్​భవన్​లో ప్రజాదర్బార్..?

రాష్ట్ర ప్రజలను కలవడానికి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించే ప్రతిపాదన తన పరిశీలనలో ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడించారు. ప్రజాదర్బార్‌ నిర్వహించాలని కోరిన ఎంబీటీ నేత అమ్జెదుల్లాఖాన్‌కు ట్వీట్‌ ద్వారా ఆమె సమాధానం ఇచ్చారు.

ఇటీవల అమ్జదుల్లాఖాన్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఆరేళ్లు అవుతున్నా ప్రజలకు అందుబాటులో లేరని... కనీసం మీరైనా ప్రజలను కలవడానికి ప్రజాదర్బార్‌ నిర్వహించాలని ఆయన కోరారు. తన లేఖను అమ్జెదుల్లాఖాన్‌ ట్వీట్‌ చేసి గవర్నర్‌ను ట్యాగ్‌ చేశారు. '‘సూచనకు కృతజ్ఞతలు. ఇప్పటికే ఆ అంశం నా పరిశీలనలో ఉంది'’ అని తన నిర్ణయాన్ని గవర్నర్‌ తమిళిసై రీట్వీట్​ చేశారు.

  • Thank you for the suggestion. Already under my consideration.

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'

Intro:TG_HYD_56_17_HABSIGUDA_ABVP_VIMOCHANADINAM_AB_TS10022
Ganesh_ou campus
( ) హైదరాబాద్ హబ్సిగూడ లొ తెలంగాణ విమోచన సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఎగురవేసి జెండా వందనం చేశారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు కెసిఆర్ తెలంగాణ రాకముందు చెప్పిన మాటలన్నీ బూటకమని అన్నారు ఇకనైనా స్పందించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారు అన్నారు
బైట్ వెంకట్ చారి... ఏబీవీపీ ఇంచార్జ్ హబ్సిగూడ


Body:TG_HYD_56_17_HABSIGUDA_ABVP_VIMOCHANADINAM_AB_TS10022


Conclusion:TG_HYD_56_17_HABSIGUDA_ABVP_VIMOCHANADINAM_AB_TS10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.