ETV Bharat / city

SNAKES: ఒకటి కాదు రెండు కాదు.. 80 పాములు ఒకే చోట..

author img

By

Published : Sep 14, 2021, 10:53 PM IST

SNAKES
పాములు

పాములంటే అందరికీ భయం.. వాటిని చూడగానే చాలామంది పరుగులు తీస్తారు. ఎక్కడైనా పాము కనిపిస్తే.. అటువైపు వెళ్లడమే మానేస్తారు. ఇక అటువైపు వెళ్తే భయం భయంగానే నడుచుకుంటూ.. దిక్కులు చూసుకుంటూ వెళ్తారు. ఒక్క పామును చూస్తేనే ఇలా ఉంటే గుంపులు గుంపులుగా పాములు కనిపిస్తే పరిస్థితి ఏంటి?

చీమలు గుంపులు గుంపులుగా వరుస క్రమంలో ఆహార అన్వేషణ కోసం రావడం చూస్తాం.. కానీ ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుర్రబ్బాడులోని ఓ పొలంలో ఏకంగా 70 నుంచి 80 పాములను పొలం యజమాని గుర్తించాడు.

గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు పొలంలో క్రిమి సంహారక మందు పిచికారీ చేసి.. వరి మళ్లలో నీళ్లు నింపాడు. రెండు రోజుల తర్వాత పొలం వద్దకు వెళ్లి చూడగా వరిమడిలో కొన్ని పాములు చనిపోయి నీటిలో తేలుతూ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన రామాంజనేయులు ఇంకా ఏమైనా పాములు ఉన్నాయేమోనన్న అనుమానంతో మడిలోని నీటిని బయటకు పంపించి చూడగా.. మరికొన్ని పాములున్నట్లు గుర్తించాడు. పొలంలో అడుగుపెడితే ఎక్కడ కాటువేస్తాయోనని భయపడ్డాడు. మొత్తానికి అన్ని పాములను బయటకు తీసి హతమార్చాడు.

SNAKES: ఒకటి కాదు రెండు కాదు.. 80 పాములు ఒకే చోట..

ఇదీ చదవండి: Boy death: హనుమాన్​నగర్​లో విషాదం.. వర్షపు నీటిలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.