సీఎల్పీ భేటీని బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సీతక్క కూడా మధ్యలోనే..

author img

By

Published : Mar 6, 2022, 2:05 PM IST

Updated : Mar 6, 2022, 3:04 PM IST

Sangareddy MLA Jaggareddy boycotts CLP meeting

Jaggareddy Boycott CLP Meeting: పార్టీలో ఎప్పటికప్పుడు ధిక్కార గొంతును వినిపించే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మరోసారి చర్చనీయాంశమయ్యారు. సీఎల్పీ భేటీని బహిష్కరించిన మరోసారి వార్తల్లో నిలిచారు. తన అనుభవాన్ని చెప్పే అవకాశం లేనప్పుడు ఎందుకు ఉండటమని వెళ్లిపోతున్నట్టు పేర్కొన్నారు.

Jaggareddy Boycott CLP Meeting: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్లు చేశారు. హైదరాబాద్ తాజ్​దక్కన్‌లో జరుగుతున్న సీఎల్పీ భేటీని జగ్గారెడ్డి బాయికాట్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను సమావేశంలో ప్రస్తావించేందుకు వచ్చానని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌ సూచించినట్టు పేర్కొన్నారు. అందుకే భేటీ నుంచి వెళ్లిపోతున్నట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

అవకాశం లేనప్పుడు ఎందుకు మరీ..

"టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదు. రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన గురించి నాకు తెల్వదు. నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి సీఎల్పీ మీటింగ్​లో ప్రస్తావించాలని వచ్చా. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని నేతలు సూచించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో పార్టీ అంశాలను ప్రస్తావిస్తే ఎజెండా చెడిపోతుందన్నారు. నాకెదురైన చేదు అనుభవాన్ని చెప్పేందుకు అవకాశం లేనప్పుడు సీఎల్పీ సమావేశంలో ఉండడమెందుకని వెళ్లిపోతున్నా. అంసెంబ్లీకి వెళ్లటం ఎమ్మెల్యేగా నా హక్కు. అసెంబ్లీకి వెళ్తా.. అక్కడ కేసీఆర్​తో కొట్లాడతా.." - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

విభేదాలు పక్కన పెట్టాలి..

కాంగ్రెస్‌లో అందరూ విబేధాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తాజ్​దక్కన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి హాజరై ఆమె పలు అంశాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు నివేదికను అందజేసినట్లు తెలిపారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే చాలా మంది నేతలు కూడా ప్రజా సమస్యలను సీఎల్పీ దృష్టికి తీసుకువచ్చారని సీతక్క పేర్కొన్నారు. తనకు ఇతర పార్టీ కార్యక్రమాలు ఉండడంతో సమావేశం మధ్యలోనే వెళ్తున్నట్లు చెప్పారు.

ఇతర కార్యక్రమాలు ఉండడం వల్లే..

చాలా అంశాలపై సీఎల్పీ నేతకు నివేదిక ఇచ్చాను. చాలమంది నేతలు అనేక ప్రజా సమస్యలు సీఎల్పీ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ కార్యక్రమాలు ఉండడం వల్ల సమావేశం మధ్యలోనే వెళ్తున్నా. పార్టీలోని అందరు నాయకులు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలి.

-సీతక్క, ములుగు ఎమ్మెల్యే

సీఎల్పీ భేటీని బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

ఇదీ చూడండి:

Last Updated :Mar 6, 2022, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.