ETV Bharat / city

'పబ్​ వ్యవహారంలో రేవంత్​ రెడ్డి, బండి సంజయ్​ రాజీనామా చేయాలి'

author img

By

Published : Apr 4, 2022, 7:49 PM IST

Updated : Apr 4, 2022, 8:18 PM IST

balka suman
balka suman

కాంగ్రెస్‌, భాజపా నాయకులు మద్యం మత్తులో ఊగుతున్నారని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్‌ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే బంజారాహిల్స్‌లోని పబ్‌పై దాడి ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. గతంలో పేకాట క్లబ్బులు కాంగ్రెస్‌ నేతలకు ఉండేవన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని స్పష్టం చేశారు.

పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంతో భాజపా, కాంగ్రెస్ నేతలకు, వారి పిల్లలకే సంబంధాలున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. భాజపా నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ పబ్ నిర్వహిస్తున్నారని... అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఉన్నారని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

'పబ్​ వ్యవహారంలో రేవంత్​ రెడ్డి, బండి సంజయ్​ రాజీనామా చేయాలి'

మేనల్లుడినే అదుపులో పెట్టలేని రేవంత్ రెడ్డి.. ప్రజలకేమి సేవ చేస్తారన్న బాల్క సుమన్... ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. నిజ స్వరూపం బయట పడినందున భాజపా, కాంగ్రెస్ నేతలు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ సంస్కృతి, విచ్చలవిడితనం భాజపా, కాంగ్రెస్ నేతలు, వారి పిల్లల్లోనే ఉందని విమర్శించారు. పోలీసుల కస్టడీ విచారణలో ఇంకా చాలా విషయాలు వస్తాయని చెప్పారు.

'కాంగ్రెస్‌, భాజపా నాయకులు మద్యం మత్తులో ఊగుతున్నారు. మద్యం మత్తులో జోగుతున్నది కాంగ్రెస్‌ నాయకులు, వారి పిల్లలే. కాంగ్రెస్‌, భాజపా నాయకులు బయటకు వచ్చి నీతులు చెబుతున్నారు. పేకాట క్లబ్బులు, పబ్బులకు రెండు జాతీయ పార్టీల నాయకులు ఆద్యులు. గతంలో పేకాట క్లబ్బులు కాంగ్రెస్‌ నేతలకు ఉండేవి. కాంగ్రెస్‌ నేతలు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. డ్రగ్స్‌ మహమ్మారిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.' - బాల్క సుమన్​, ప్రభుత్వ విప్​

తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పబ్బుపై రైడ్ చేసి ఇదంతా బయటపెట్టిందని బాల్క సమన్ తెలిపారు. చిత్తశుద్ధి లేకపోతే పబ్‌పై దాడి ఎందుకు జరుగుతుందని ​ అన్నారు. గంజాయి, పేకాట క్లబ్బులు, గుడుంబాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందన్నారు.

సంబంధిత కథనాలు:

Last Updated :Apr 4, 2022, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.