ETV Bharat / city

సముద్ర తీరానికి అరుదైన చేప.. 3 టన్నుల బరువు!

author img

By

Published : Jul 11, 2022, 7:28 PM IST

rare-fish-washed-ashore
rare-fish-washed-ashore

ఏపీలోని కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సూర్యారావుపేటలోని.. ఎన్టీఆర్ బీచ్ తీరానికి అరుదైన బుక్క సర్రా చేప కొట్టుకొచ్చింది. ఇది మత్స్యకారుల వలకు చిక్కి చనిపోయినట్లు తెలుస్తోంది. సుమారు 25 అడుగుల పొడవు.. 3 టన్నుల వరకు బరువు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేప పూర్తిగా శాకాహారి అని.. సముద్రంలో ఉండే నాచు మాత్రమే తింటుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.