ETV Bharat / city

Ram Gopal Varma tweet: 'భీమ్లా నాయక్' ట్రైలర్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్లు

author img

By

Published : Feb 22, 2022, 3:44 PM IST

Ram Gopal Varma tweets on Bheemla Nayak Trailer: రామ్​గోపాల్​ వర్మ 'భీమ్లా నాయక్' ట్రైలర్‌పై వివాదాస్పద ట్వీట్లు చేశారు. దగ్గుబాటి రానాని ప్రమోట్​ చేసేందుకు పవన్​ కల్యాణ్​ను వాడుకున్నారని.. పవన్​ అభిమానిగా తాను హర్ట్​ అయ్యానని సంచలన కామెంట్స్​ చేశాడు.

Ram Gopal Varma tweet on Bheemla Nayak Trailer
Ram Gopal Varma tweet on Bheemla Nayak Trailer

Ram Gopal Varma comments on Bheemla Nayak Trailer: వివాదాలు వైఫైలా చుట్టూ తిప్పుకునే సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. తాజాగా విడుదలై రికార్డులు బద్దలుగొడుతున్న 'భీమ్లా నాయక్‌' మూవీ ట్రైలర్​పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

'భీమ్లా నాయక్‌' ట్రైలర్​ చూశాక.. డేనియల్​ శేఖర్​ అని పిలవాలనిపిస్తుందని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు. దగ్గుబాటి రానాని ప్రమోట్​ చేసేందుకు పవన్​ కల్యాణ్​ను వాడుకున్నారని.. పవన్​ అభిమానిగా తాను హర్ట్​ అయ్యానని మరో ట్వీట్​ చేశాడు. పవన్ కల్యాణ్​ను 'భీమ్లా నాయక్‌' ట్రైలర్​తో, దగ్గుబాటి రానాని పూర్తి సినిమాతో పోలుస్తూ మరో సంచలన ట్వీట్​ చేశాడు ఆర్జీవీ. బాహుబలి సినిమాతో రానా దగ్గుబాటి నార్త్​లో పాపులర్​ అయ్యాడని.. అందువల్ల ఈ సినిమాలో పవన్​ను విలన్​ అని అక్కడి అభిమానులు పొరబడే అవకాశం ఉందని.. నిర్మాతలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారని సంచలన కామెంట్స్​ చేశాడు.

  • Going by @BheemlaNayakTrailer , in the north where Rana is much more popular than @PawanKalyan due to #Bahubali , there’s a danger of him coming across as the villain in the film and @RanaDaggubati as the hero ..Am shocked why the makers close to P K allowed this to happen?

    — Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వర్మ పోస్ట్​పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెచ్చిపోతున్నారు. వర్మను మించిన కామెంట్లు చేస్తూ హీట్​ పెంచుతున్నారు.

ఇదీ చూడండి: భీమ్లా నాయక్ ట్రైలర్ అదిరింది.. సినిమా రిలీజ్​ వరకు రచ్చ రచ్చే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.