ETV Bharat / city

LIVE UPDATES :మరో రెండోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Jul 23, 2022, 6:46 AM IST

Updated : Jul 23, 2022, 9:32 PM IST

rains in telangana live updates
rains in telangana live updates

21:30 July 23

మరో రెండోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం: సీఎం కేసీఆర్‌

  • మరో రెండోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం: సీఎం కేసీఆర్‌
  • ఇటీవలి కంటే భారీగా వరదలు సంభవించే ప్రమాదం: సీఎం
  • ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎం
  • ప్రజలు అనవసర ప్రయాణాలు మాని, అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • ఒక్క ప్రాణనష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తం కావాలి: సీఎం
  • గోదావరి రేపు మధ్యాహ్నం నుంచే ఉద్ధృతంగా మారే ప్రమాదం: సీఎం
  • భారీ వర్షాలు ఆగస్టు మొదటివారం దాకా కొనసాగే సూచనలు: సీఎం
  • రామన్నగూడెం, ఏటూరునాగారం, భద్రాచలంలో చర్యలు చేపట్టాలి: సీఎం
  • హైదరాబాద్‌లో అదనంగా మరో రెండు హెలికాప్టర్లు ఉంచండి: సీఎం
  • ములుగు, కొత్తగూడెంలో హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలి: సీఎం
  • ఖమ్మం, కొత్తగూడెంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి: సీఎం
  • ఎన్డీఆర్ఎఫ్, వరద సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలి: సీఎం
  • గోదావరి నుంచి వచ్చే వరదను వచ్చినట్టే కిందికి విడుదల చేయాలి: సీఎం
  • ఇన్‌ఫ్లోకు సమానంగా నీటిని విడుదల చేయాలి: సీఎం కేసీఆర్‌
  • మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలి: సీఎం

19:21 July 23

భద్రాచలం ముంపు ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారన్న సీఎం

  • మొన్నటి వరదలప్పుడు అధికారులు బాగా పనిచేశారన్న సీఎం
  • భద్రాచలం ముంపు ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారన్న సీఎం
  • ఆరోగ్యశాఖ మంత్రి, డీహెచ్, అధికారులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం
  • ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉన్నతీరు అభినందనీయమన్న సీఎం
  • అదే స్ఫూర్తితో రేపటి విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవాలన్న సీఎం
  • హైదరాబాద్‌ రోడ్ల పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్న సీఎం
  • దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ జరుగుతోందన్న ఆర్ అండ్ బీ మంత్రి
  • సబ్ స్టేషన్లు మునగకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలి: సీఎం కేసీఆర్

17:39 July 23

టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయొచ్చన్న రజత్ కుమార్

  • హైదరాబాద్‌లో వరదలు, చెరువుల పరిస్థితిపై ఆరా తీసిన సీఎం
  • వరదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులు
  • ప్రాజెక్టుల పరిస్థితులను సీఎంకు వివరించిన నీటిపారుదల శాఖ అధికారులు
  • గంటగంటకూ మారుతున్న పరిస్థితిపై ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వివరణ
  • ముందస్తు చర్యల కోసం టెక్నాలజీని వినియోగించుకోవచ్చన్న రజత్ కుమార్
  • వాతావరణశాఖ వరద ముప్పును పసిగట్టలేక పోతోందన్న అధికారులు
  • టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయొచ్చన్న రజత్ కుమార్

17:22 July 23

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి: సీఎం

  • త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు గోదావరి పొంగిపొర్లుతోంది: సీఎం
  • గోదావరి ఉప నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి: సీఎం
  • మరో 2, 3రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక: సీఎం
  • రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయం: సీఎం కేసీఆర్‌
  • కష్టకాలంలో ప్రజలను కాపాడేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి: సీఎం
  • అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలివెళ్లకూడదు: సీఎం
  • గోదావరి ఎల్లుండి వరకు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం: సీఎం
  • ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే అవకాశం ఉంది: సీఎం
  • గోదావరి పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి: సీఎం
  • వైద్య, పంచాయతీరాజ్, విద్యుత్, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • అన్ని స్థాయిల్లోని పోలీసు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దు: సీఎం

17:11 July 23

లోయర్‌ మానేరు 16 గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కులు విడుదల

  • కరీంనగర్ లోయర్‌ మానేరు ప్రాజెక్టుకు పెరిగిన వరద
  • మోయతుమ్మెద వాగు, మధ్యమానేరు నుంచి భారీగా వరద
  • లోయర్‌ మానేరు ప్రాజెక్టుకు 29 వేల క్యూసెక్కుల ప్రవాహం
  • లోయర్‌ మానేరులో ప్రస్తుతం 21 టీఎంసీల నీటి నిల్వ
  • లోయర్‌ మానేరు 16 గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కులు విడుదల

16:25 July 23

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండాలో తెగిన బోథ్ చెరువు కట్ట

  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండాలో తెగిన బోథ్ చెరువు కట్ట
  • గంగారం బోథ్‌ చెరువు తెగడంతో సమీప గ్రామాలు జలమయం
  • బోథ్‌ చెరువు తెగటంతో భయం గుప్పిట్లో లోతట్టు గ్రామాల ప్రజలు

16:04 July 23

రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

  • రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
  • వరదలు, సహాయక చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష
  • మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిస్తున్న సీఎం
  • ఇప్పటికే కురుస్తున్న భారీ వానలు, వరదల నేపథ్యంలో సమీక్ష
  • ఇంకా భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎం సమీక్ష

15:36 July 23

2 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు..!

  • వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
  • ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రాణనష్టం జరగకూడదు: సీఎస్‌
  • 2 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది: సీఎస్‌
  • కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌
  • జలాశయాలు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి: సీఎస్‌
  • రోడ్లు, వంతెనలు తెగిన చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి: సీఎస్‌
  • అన్ని శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలి: సీఎస్‌

13:58 July 23

కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన పౌల్ట్రీ ఫామ్

  • లింగంపేట్ మం. లొంకలపల్లిలో నీట మునిగిన పౌల్ట్రీ ఫామ్
  • వేలల్లో చనిపోయిన కోళ్లు
  • ఆర్థిక నష్టంతో లబోదిబోమంటున్న రైతు

13:58 July 23

మంజీరా వాగులో చిక్కుకున్న రైతు

  • కామారెడ్డి జిల్లా బిచ్కుంద మం. కుర్థం వద్ద మంజీరా వాగులో చిక్కుకున్న శ్రీనివాస్ అనే రైతు
  • గజ ఈతగాళ్ళు సహాయంతో బయటకు తీసుకుని వచ్చిన అధికారులు

13:34 July 23

మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షసూచన

  • ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద వచ్చే అవకాశం
  • యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
  • ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

13:24 July 23

నిర్మల్ జిల్లా: స్వర్ణ జలాశయంలోని చేరుతున్న వరద నీరు

  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1182 అడుగులు
  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 14వేల క్యూసెక్కుల నీరు
  • స్వర్ణ జలాశయం 2 గేట్ల ద్వారా 18వేల క్యూసెక్కులు విడుదల

13:07 July 23

ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

  • రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ
  • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు: వాతావరణశాఖ
  • రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ
  • హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ
  • హైదరాబాద్‌లో మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం: వాతావరణశాఖ
  • ఇప్పటికే సాధారణ వర్షాపాతం కంటే అత్యధికంగా నమోదు: వాతావరణశాఖ
  • నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదు: వాతావరణశాఖ

12:29 July 23

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద

  • ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 39,230 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 35,984 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1087.7అడుగులు
  • ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు
  • ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 75.465 టీఎంసీలు
  • ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 90.3 టీఎంసీలు

12:29 July 23

ఖమ్మం చెక్‌డ్యాం నుంచి కాకుండా పక్కనుంచి పారుతున్న వరద

  • రూ.4.29 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న తనకంపాడు చెక్‌డ్యాం
  • చెక్‌డ్యాం నిర్మాణం లోపం వల్లే సమస్య ఏర్పడిందన్న రైతులు
  • పక్క నుంచి వరద పారడంతో పంట పొలాల్లోకి చేరుతున్న నీరు

12:15 July 23

భద్రాచలం గోదావరి నీటిమట్టం 45.90అడుగులు

  • వరద ప్రవాహం 10,48,826 క్యూసెక్కులు

11:50 July 23

శ్రీశైలం జలాశయంలో 3 గేట్లు ఎత్తిన అధికారులు

  • శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,18,578 క్యూసెక్కులు
  • శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 1,90,000 క్యూసెక్కులు
  • శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 882.60 అడుగులు
  • శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 202.50 టీఎంసీలు

11:27 July 23

ఖమ్మం జిల్లాలో జోరు వానలకు పొంగుతున్న వాగులు, వంకలు

  • ఖమ్మం గ్రామీణం మండలంలో పొంగి పొర్లుతున్న మున్నేరు, ఆకేరు
  • తీర్థాల వద్ద వంతెనపై నుంచి ప్రవహిస్తున్న ఆకేరు వాగు
  • తీర్థాల- గోళ్లపాడు మధ్య రాకపోకలు బంద్
  • మున్నేరులో మునిగిపోయిన తీర్థాల ఎత్తిపోతల పథకం

11:27 July 23

నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

  • ఏడు గేట్లు 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
  • మూసీ ఇన్‌ఫ్లో 8,764.52 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 12,099.18 క్యూసెక్కులు
  • మూసీ పూర్తిస్థాయి సామర్థ్యం 645 అడుగులు
  • మూసీ ప్రస్తుత సామర్థ్యం 641.25అడుగులు

11:25 July 23

వర్షాలపై జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

  • వాగుల ఉద్ధతితో జనగామ-హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిపివేత
  • జనగామ-పాలకుర్తి మధ్య రాకపోకలు నిలిపివేత
  • కేశిరెడ్డిపల్లి చెరువు మత్తడి ప్రవహిస్తుండడంతో నర్మెట్ట మధ్య రాకపోకల బంద్‌

11:25 July 23

నల్గొండ: అనంతారం వద్ద మూసీ నదిలో భారీగా వరద

  • మూసీ నదిలో 230.5 మీటర్ల వద్ద నీటిమట్టం
  • ప్రమాదకర స్థితిలో వరద ఉందని హెచ్చరించిన కేంద్ర జలసంఘం

10:28 July 23

  • హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద
  • హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు
  • కూకట్‌పల్లి నాలా నుంచి భారీగా వస్తున్న వరద

10:27 July 23

  • కామారెడ్డి: నాగిరెడ్డిపేట మం. కన్నారెడ్డిలో పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
  • భారీ వర్షాలకు మహారాష్ట్ర సరిహద్దుల్లోని లెండి వాగుకు పోటెత్తిన వరద
  • మద్నూర్ మం. గోజేగావ్ వద్ద నీట మునిగిన లోలెవల్ బ్రిడ్జి
  • గోజేగావ్-మద్నూర్‌ల మధ్య నిలిచిన రాకపోకలు
  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 36,400 క్యూసెకులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1403.25 అడుగులు
  • కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో కల్యాణి ప్రాజెక్టుకు భారీ వరద
  • గేట్లు తెరుచుకోక పోవడంతో గేట్ల పైనుంచి ప్రవహిస్తున్న వరద

10:27 July 23

  • ఆదిలాబాద్: సాత్నాల ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
  • సాత్నాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,600 క్యూసెక్కులు
  • మత్తడివాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
  • మత్తడివాగు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులు

10:25 July 23

  • కుమురంభీం: ఆసిఫాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన

10:24 July 23

  • సిద్దిపేట: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు
  • హనుమకొండ-సిద్దిపేట లోలెవెల్ వంతెనపైనుంచి పారుతున్న వాగు
  • వాగు ఉద్ధృతితో బస్వాపూర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు
  • హనుమకొండ-సిద్దిపేట వైపు వెళ్లే రాకపోకలు నిలిపివేత
    పోరెడ్డిపల్లి మీదుగా హుస్నాబాద్ వైపు వాహనాల దారి మళ్లింపు

10:24 July 23

  • మహబూబాబాద్: అర్పనపల్లి వంతెపై ఉద్ధృతంగా పారుతున్న వట్టివాగు
  • కేసముద్రం-గూడూరు మధ్య నిలిచిన రాకపోకలు
  • దంతాలపల్లి మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు
  • దంతాలపల్లి-పెద్దముప్పారం గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
  • నర్సింహులపేట మం. కొమ్ములవంచలో వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు
  • పాఠశాల బస్సును జేసీబీ సాయంతో బయటకు తీసిన గ్రామస్థులు
  • నరసింహులపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు

10:23 July 23

  • భద్రాద్రి: చర్ల మండలంలో వరద బాధితులకు నిత్యవసర సరకులు పంపిణీ
  • నిత్యవసరాలు పంపిణీ చేసిన గుంటూరుకు చెందిన సాయినాథ్ ట్రేడర్స్
  • కొత్తపల్లి, కొంపల్లి, లింగాపురం, గొంపల్లి ప్రజలకు సరకులు పంపిణీ

10:21 July 23

  • భద్రాచలం గోదావరి నీటిమట్టం 45.8 అడుగులు
  • వరద ప్రవాహం 10,44,822 క్యూసెక్కులు

10:21 July 23

  • ములుగు: ముత్తారం వాగులో చిక్కుకున్న గ్రామస్థులు
  • వాగు ఒక్కసారిగా పొంగడంతో చిక్కుకున్న గ్రామస్థులు
  • ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో బయటపడిన గ్రామస్థులు

10:20 July 23

  • మహబూబాబాద్: అర్పనపల్లి వంతెపై ఉద్ధృతంగా పారుతున్న వట్టివాగు
  • కేసముద్రం-గూడూరు మధ్య నిలిచిన రాకపోకలు

10:19 July 23

  • హైదరాబాద్‌: జంట జలాశయాలకు భారీగా వరద
  • హైదరాబాద్‌: ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ 2 గేట్ల ద్వారా మూసిలోకి 1248 క్యూసెక్కులు విడుదల
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1786.65 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌కు వస్తున్న 500 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ 2 గేట్ల ద్వారా మూసిలోకి 330 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.50 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

10:18 July 23

  • నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం
  • బోరిగాం, దిమ్మదుర్తి వద్ద అప్రోచ్ రోడ్లపై నుంచి పొంగుతున్న వరద
  • మంచిర్యాల-నిర్మల్ మార్గంలో రాకపోకలకు అంతరాయం

10:18 July 23

  • యాదాద్రి: భీమలింగంలో లోలెవల్ వంతెన పైనుంచి పారుతున్న మూసీనది
  • హైదరాబాద్‌లో వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీనది

10:17 July 23

  • జగిత్యాల జిల్లాలో భారీ వర్షం
  • అనంతారం జాతీయరహదారిపై పారుతున్న వరద
  • ధర్మపురి-జగిత్యాల మధ్య నిలిచిన రాకపోకలు

10:17 July 23

  • మెదక్: హావేలీ ఘనపూర్ మం. కప్రయిపల్లీ వద్ద తెగిన ప్రధాన రోడ్డు
  • రోడ్డు తెగిపోవటంతో కొట్టుకుపోయిన 6 ఆవులు

10:16 July 23

  • నిర్మల్: స్వర్ణ జలాశయంలోని చేరుతున్న వరద నీరు
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1181.3 అడుగులు
  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 9,500 క్యూసెక్కులు
  • స్వర్ణ జలాశయం 2 గేట్ల ద్వారా 11వేల క్యూసెక్కులు విడుదల
  • నిర్మల్‌-ఖానాపూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు

10:16 July 23

  • భద్రాద్రి: ఆళ్లపల్లి మం. రాఘవపురం వద్ద కోతకు గురైన రోడ్డు
  • ఆళ్లపల్లి-మర్కోడు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

10:15 July 23

  • హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
  • మెదక్‌: రామాయపల్లి రైల్వే అండర్‌పాస్‌ వంతెన కింద నీరు
  • వంతెన కింద నీరు నిలవడంతో భారీగా నిలిచిన వావానాలు

10:15 July 23

  • కామారెడ్డి: రాజంపేట మం. ఎల్లాపూర్‌తండా బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద
  • మిషన్ భగీరథ పైపులు కొట్టుకుపోతుండగా ట్రాక్టర్‌ సాయంతో అడ్డుకున్న గ్రామస్థులు
  • బిచ్కుంద మం. పెద్ద దేవడాలో నీట మునిగిన సోయాబీన్ పంటలు
  • కొండాపూర్, గుడితండా గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
  • పిట్లం మండలం తిమ్మానగర్ వద్ద తెగిన నల్లవాగు వంతెన
  • పిట్లం మం., నారాయణఖేడ్, సిర్గాపూర్ మండలాలకు నిలిచిన రాకపోకలు

10:14 July 23

  • నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
  • రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
  • శ్రీరాంసాగర్ 9 గేట్లు, కౌలాస్‌నాలా 5 గేట్లు ఎత్తివేత
  • నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

10:13 July 23

  • భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా పెరుగుతున్న వరద
  • 25 గేట్లు ఎత్తి 1.99 లక్షల క్యూసెక్కులు విడుదల

08:41 July 23

కామారెడ్డి: బిచ్కుంద మండలంలో చిన్నదడిగి వంతెనపై వరద

  • వంతెనపై వరద ప్రవాహంతో 5గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • లింగంపేట-పోల్కంపేట గ్రామాలకు నిలిచిన రాకపోకలు

08:41 July 23

మేడ్చల్‌: జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువుకు భారీగా వరద

  • భయాందోళనలో ఉమామహేశ్వరకాలనీ వాసులు
  • కొంపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఫాక్స్‌సాగర్‌కు వరద

08:41 July 23

భద్రాద్రి కొత్తగూడెం: తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద

  • 23 గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులు గోదావరికి విడుదల
  • ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • కోయగూడెం ఉపరితల గనిలో రాత్రి నుంచి నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • కోయగూడెంలో 5.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు

08:40 July 23

హైదరాబాద్‌: జంట జలాశయాలకు భారీగా వరద

  • హైదరాబాద్‌: ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ 2 గేట్ల ద్వారా మూసిలోకి 832 క్యూసెక్కులు విడుదల
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1786.65 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌కు వస్తున్న 500 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ 2 గేట్ల ద్వారా మూసిలోకి 330 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.50 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

08:40 July 23

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దంచికొడుతున్న వానలు

  • శివ్వంపేట మండలంలో కుండపోత వర్షం
  • కుండపోత వర్షంతో అలుగు పారుతున్న కుంటలు
  • శివ్వంపేటలో కూలిన రామాలయం ప్రహరీ గోడ
  • శివ్వంపేటలో కూలిన పురాతన బురుజు గోడ
  • మాసాయిపేట మండలంలో ఉద్ధృతంగా హల్దీ ప్రాజెక్టు
  • వెల్దుర్తి మం. ఉప్పులింగాపూర్ హల్దీ వాగు వంతెనపై వరద
  • రాకపోకలు నిలిపివేసి వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు
  • మెదక్‌: మత్తడి పారుతున్న వెల్దుర్తి కుడి చెరువు
  • సింగూర్ గేట్లు ఎత్తడంతో పొంగుతున్న వనదుర్గ ప్రాజెక్టు
  • కొల్చారంలో భారీ వర్షానికి అలుగు పారుతున్న కోతుల చెరువు
  • మెదక్‌ జిల్లాలో ప్రభుత్వ బడులకు సెలవు ప్రకటించిన అధికారులు
  • మెదక్‌: హవేలి ఘనపూర్- గంగాపూర్ మధ్య రాకపోకలు నిలిపివేత
  • భారీ వర్షానికి వంతెన కూలి వాహన రాకపోకలకు అంతరాయం

08:39 July 23

మెదక్ పరిసర ప్రాంతాల్లో మంజీరా నది ఉద్ధృతి

  • ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలోకి చేరిన వరద నీరు
  • నార్సింగ్ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవాహం
  • వరద ధాటికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌
  • బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి

08:39 July 23

పాలేరు జలాశయానికి పోటెత్తిన వరద

  • పాలేరు జలాశయం ఇన్‌ఫ్లో 30 వేల క్యూసెక్కులు
  • పాలేరు జలాశయం 20 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
  • పాలేరు జలాశయం వంతెనపై అడుగు మేర ప్రవహిస్తున్న వరద

08:39 July 23

నిర్మల్ జిల్లాలో ఎకధాటిగా కురుస్తున్న వర్షం

  • ఖానాపూర్‌లో జలమయమైన జేకే నగర్, మధురానగర్
  • ఖానాపూర్-మస్కపూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు

08:38 July 23

సూర్యాపేట: వాగులో చిక్కుకున్న కూలీలను బయటకు తెచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌

  • నిన్న పాలేరు వాగులో చిక్కుకున్న 22 మంది వ్యవసాయ కూలీలు
  • మద్దిరాల మండలం ముకుందాపురం వద్ద పాలేరు వాగు ఉద్ధృతి
  • వాగు మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న కూలీలు
  • వరి నాట్లు వేసేందుకు వెళ్లి పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలు

08:37 July 23

వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి

  • మెదక్‌: చేగుట్ట మండలం రెడ్డిపల్లిలో విషాదం
  • స్టీల్‌ పరిశ్రమ గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి

08:37 July 23

సిద్దిపేట: కోహెడ మండలంలో రెండ్రోజులుగా భారీ వర్షం

  • వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు
  • పోరెడ్డిపల్లి వద్ద ఉప్పొంగుతున్న వాగు ప్రవాహం

07:07 July 23

మరో నాలుగు వారాల పాటు వర్షాలు సమృద్ధి వర్షాలు

  • మెదక్‌ జిల్లా పాతూర్‌లో 26.1 సెంటిమీటర్ల నమోదు
  • జనగామ జిల్లా దేవరుప్పులలో 25.5
  • మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 22.2
  • సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4
  • కొత్తగూడెంలో 20
  • కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 18.5

07:07 July 23

సూర్యాపేట: వాగులో చిక్కుకున్న 14 మందిని బయటకు తెచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌

  • 2 విడతల్లో 14 మందిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం
  • నిన్న పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది వ్యవసాయ కూలీలు
  • మద్దిరాల మండలం ముకుందాపురం వద్ద పాలేరు వాగు ఉద్ధృతి
  • వాగు మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న కూలీలు
  • వరి నాట్లు వేసేందుకు వెళ్లి పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలు

07:06 July 23

కామారెడ్డి: కౌలాస్‌నాలా జలాశయం 5 గేట్లు ఎత్తివేత

  • రాత్రి భారీగా వరద రావడంతో జలాశయం గేట్లు ఎత్తివేత
  • జలాశయానికి 26,794 క్యూసెక్కుల వరద ప్రవాహం
  • కౌలాస్‌నాలా జలాశయం ప్రస్తుత నీటిమట్టం 457.90 మీటర్లు
  • కౌలాస్‌నాలా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు
  • ప్రస్తుత నీటినిల్వ 1.21 టీఎంసీలు, పూర్తి నీటినిల్వ 1.23 టీఎంసీలు

07:06 July 23

హైదరాబాద్‌లో మరోసారి ముంచెత్తిన వర్షాలు

  • హైదరాబాద్‌: ఏకధాటి వర్షాలకు లోతట్టుప్రాంతాలు జలమయం
  • వరదల వల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
  • హైదరాబాద్‌: రోడ్లపై వరద నీరు చేరికతో వాహనదారుల ఇబ్బందులు
  • హైదరాబాద్‌: లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి చేరిన వర్షపు నీరు
  • హైదరాబాద్‌: పలుచోట్ల నాలాల ఆక్రమణతో కాలనీల్లోకి మురుగునీరు

06:29 July 23

వరంగల్​లో కూలిన భవనం.. ఇద్దరు మృతి

  • రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
  • భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగులు, చెరువులు
  • వరంగల్ మండిబజారులో వర్షానికి కూలిన పాత భవనం
  • వరంగల్‌: ప్రమాదంలో ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
  • జనగామ: రెండు వాగుల మధ్య చిక్కుకున్న 14 మంది కూలీలు సురక్షితం
  • మహిళా కూలీలను బయటకు తీసుకువచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
Last Updated : Jul 23, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.