ETV Bharat / city

భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్

author img

By

Published : Sep 6, 2022, 3:28 PM IST

Updated : Sep 6, 2022, 4:56 PM IST

Rain
Rain

Rain in hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నగరంలోని ఎల్బీనగర్, మన్సూరాబాద్‌, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్​లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Rain in hyderabad: ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్‌, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్‌, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులకు గత కొన్ని రోజులుగా ఉన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించింది.

భాగ్యనగరంలో భారీ వర్షం.. విద్యార్థులు, వాహనదారుల ఇబ్బందులు..

నగరంలోని ఫలక్‌నుమా, కాలాపత్తర్, చాంద్రాయణగుట్ట బహదూర్‌పురా, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, వికారాబాద్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్‌, నాచారం, కాప్రాలోనూ వరుణుడు దంచికొట్టాడు. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు: రాష్ట్రంలో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ... ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని... ఈ ఆవర్తన ప్రభావంతో తదుపరి 48గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాని సంచాలకులు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 6, 2022, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.