ETV Bharat / city

వినూత్న నిరసన... ప్రైవేటు ఉపాధ్యాయుల భిక్షాటన

author img

By

Published : Dec 31, 2020, 2:48 PM IST

ఎల్బీనగర్ కూడలిలో ప్రైవేటు ఉపాధ్యాయులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. పనిలేక, జీతాలు లేక బతకడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నామని.. తెరాస ప్రభుత్వం తమను పట్టించుకోలేవడం లేదని ఉపాధ్యాయులు వాపోయారు.

Private Teachers protest with begging at lb nagar
భిక్షాటన చేస్తూ ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన

హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తోన్న ప్రైవేటు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పనిలేక, జీతాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామని.. తెరాస ప్రభుత్వం తమను పట్టించుకోలేవడం లేదని ఉపాధ్యాయులు వాపోయారు.

10 నెలలుగా కొవిడ్​తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. భిక్షాటనతోనూ బతకనివ్వడం లేదని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి.. పొట్ట గొట్టే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల చేతిలో నుంచి పోలీసులు డబ్బులు లాక్కొని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: నుమాయిష్​ వాయిదా... కొవిడ్​ నిబంధనలే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.