ETV Bharat / city

పోలీసు ఉద్యోగ దరఖాస్తులకు సర్వం సిద్ధం... సాంకేతిక సమస్యలు రాకుండా...

author img

By

Published : Apr 30, 2022, 12:03 PM IST

Updated : Apr 30, 2022, 1:31 PM IST

TS Police Jobs Application : పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన జారీ అయిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెద్దఎత్తున అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తు చేసుకుంటే.. సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో టెక్నికల్ సమస్యలు రాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

TS Police Jobs Application
TS Police Jobs Application

TS Police Jobs Application : అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయం సమీపిస్తోండటంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పెద్దఎత్తున అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో రద్దీని తట్టుకోవడంపైనే దృష్టి సారించారు.

TS Police Jobs Application in Telangana : పోలీసుశాఖతో పాటు జైళ్లు, అగ్నిమాపక, ప్రత్యేక పోలీసు దళం, రవాణాశాఖల్లో దాదాపు 17వేల ఉద్యోగాల భర్తీకి నియామక మండలి ఇప్పటికే ప్రకటనలు జారీచేసిన సంగతి తెలిసిందే. అర్హులు మే 2 నుంచి 20వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2018 మే 30న 18,373 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీచేయగా అప్పట్లో 7,19,840 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరిసారిగా పోలీసు ఉద్యోగాల నియామకం జరిగి నాలుగేళ్లు కావస్తుండటంతో ఈసారి కనీసం 9లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.

TS Police Job Notification : సోమవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుండగా తొలి రోజుల్లో పెద్దగా రద్దీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ ప్రక్రియలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు చేరువలోని ఇంటర్నెట్‌ కేంద్రాలు, తెలిసిన వారి కంప్యూటర్ల నుంచి దరఖాస్తులు చేస్తుంటారు. దీనివల్ల అప్‌లోడ్‌ చేయడం మొదలుకుని ఫీజు చెల్లింపులు వంటి అనేక అంశాల్లో సమస్యలు తలెత్తవచ్చు.

Telangana Police Job Notification : గతానుభవాల దృష్ట్యా ఇలాంటివి ముందుగానే ఊహించి చర్యలు చేపడుతున్నారు. 2018 నియామకాల సందర్భంగా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి 21 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఈసారి సాధ్యమైనంత వరకూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రక్రియ అతి సరళంగా ఉండేలా చూసేందుకు అధికారులు ప్రాధాన్యమిచ్చారు. 2018లో నియామకాల సందర్భంగా మొత్తం దరఖాస్తుల్లో 51 శాతం చివరి ఆరు రోజుల్లోనే వచ్చాయి. అంటే మొదటి వారం పది రోజుల్లో పెద్దగా రద్దీ ఉండకపోవచ్చని, ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా సరిదిద్దుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Apr 30, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.